అభిమానం అనేది ఒక లిమిట్ వరకు ఉంటే అందంగానే ఉంటుంది. స్టార్స్ కూడా అభిమానుల కేరింతలను చాలా ఇష్టపడుతుంటారు. అయితే కొన్ని సార్లు హార్డ్ కొర్ ఫ్యాన్స్ ప్రవర్తన సినీ తారలకు చేదు అనుభవాన్ని కలిగిస్తుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. రీసెంట్ గా రష్మిక మందన్న కూడా ఒక అభిమాని చేసిన పనికి షాక్ కి గురైంది.

అతను ముద్దు పెట్టి పారిపోవడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  ఒక ఈవెంట్ లో రష్మిక అభిమానులకు హాయ్ చెబుతూ వెళుతుండగా ఒక అభిమాని ఆమె చెంపపై ముద్దు పెట్టి పరిగెత్తడు. బాడి గార్డ్స్ ఉన్నప్పటికీ అతను చాకచక్యంగా తప్పించుకొని పారిపోయాడు. కొన్ని సెకన్ల పాటు రష్మిక మైండ్ బ్లాంక్ అయ్యింది. వెంటనే అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయిందట. ఇక అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వెంటనే రష్మిక టీమ్ ఆ వీడియో ని దిలీట్ చేశయించింది. విషయంపై సీరియస్ అయిన రష్మిక టీమ్ పోలీసులకు సమాచారం అందించారట.  ఇంతకుముందు కూడా చాలా మంది హీరోయిన్స్ కూడా ఇలాంటి చేదు అనుభవాలని ఎదుర్కొన్నవారే. అందుకే ముందు జాగ్రత్తగా స్టార్స్ సెక్యూరిటీని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటారు. ఇకపోతే రష్మిక ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన భీష్మ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది.