కరోనా ప్రభావంతో హీరోలు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికే హీరోల తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన వీడియోలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని బహు భాషా నటుడు మాధవన్‌ కు ఓ ఇట్రస్టింగ్ ఫోటోలను ట్యాగ్ చేశాడు. మాధవన్‌ లవర్‌ బాయ్‌ లుక్‌ లో ఉన్న ఫోటోతో పాటు రాకెట్రీ సినిమాలోని ఆయన లుక్‌కు సంబంధించిన ఫోటోలను ట్విటర్‌ లో పోస్ట్ చేశాడు.

ఈ ఫోటోలతో పాటు డే 1లో మాధవన్‌ డే 21 న మాధవన్ అంటూ కామెంట్ చేశాడు. ఈ ఫోటోలను మాధవన్‌ కు ట్యాగ్ చేయటంతో మాధవన్ స్పందించాడు. `నేను అంగీకరిస్తాను. దేశం మరియు మానజాతి హితం కోసం ఈ పరిస్థితిని కూడా నేను అంగీకరిస్తాను` అంటూ రిప్లై ఇచ్చాడు మాధవన్‌. ఈ విలక్షణ నటుడు ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

మాధవన్ ఫోటోలను అభిమానులు ట్వీట్ చేస్తే హాలీవుడ్ నటుడు జిమ్‌ క్యారీ వరుసగా తన ఫోటోలను తానే ట్వీట్ చేస్తున్నాడు. డే 1, డే 2 అంటూ వరుసగా తన గెడ్డం ఎంత పెరుగుతుందో చూపిస్తూ ఫోటోలు పోస్ట్ చేస్తూ వస్తున్నాడు. దేశంలోనూ 21 రోజుల పాటు ప్రధాని లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో ప్రజా జీవితం స్థంభించింది. దేశంలో ఇప్పటికే 650 మందికి పైగా కరోనా పాజిటివ్‌ అని తేలింది.