మంగళవారం నాడు దసరా సందర్భంగా చాలా సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు సందడి చేశాడు. ఈ క్రమంలో రాజమౌళి రూపొందిస్తోన్న 'RRR' సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ఒకటి వచ్చింది. ఈ పోస్టర్ చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది అఫీషియల్ పోస్టర్ కాదు.. ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని తెలుస్తోంది. కొన్ని రోజులుగా 'RRR' టీమ్ 'రామ రౌద్ర రుషితం' అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు అదే టైటిల్ తో ఎవరో పోస్టర్ రిలీజ్ చేశారు. అదే నిజమైన టైటిల్ అనుకొని కొంతమంది సోషల్ మీడియాలో తెగ షేర్ చేశారు. ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒరిజినల్ పోస్టర్ కి ఎంతమాత్రం తక్కువగా లేదు. దీంతో చాలా మంది టైటిల్ ఫిక్స్ అయిందని అనుకున్నాడు. గతంలో 'RRR' టైటిల్ ఇదేనంటూ కొన్ని టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి.

కానీ ఏ టైటిల్ కి రానంత క్రేజ్ దీనికి వచ్చింది. దసరా నాడు ఈ పోస్టర్ బాగా వైరల్ అయింది. నిజానికి 'RRR' సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. టైటిల్ కి సంబంధించి చిత్రబృందం సినిమా అనౌన్స్ చేసిన రోజే కాంటెస్ట్ పెట్టింది కానీ ఇప్పటివరకు టైటిల్ మాత్రం రివీల్ చేయలేదు. 

అలియా భట్, అజయ్ దేవగన్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ చిత్రాన్ని డీవీవ దానయ్య నిర్మిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. బాహుబలి వంటి బ్లాక్‌ బస్టర్ హిట్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్నఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.