ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ చాలా దేశాల ఆర్థిక వ్యవస్థపై కూడా గట్టి దెబ్బె కొడుతోంది. అలాగే సినిమా ఇండస్ట్రీలను కూడా ఈ వైరస్ చాలానే కలవరపెడుతోంది. చాలా వరకు సినిమా రిలీజ్ డేట్స్ వాయిదా పడుతున్నాయి. వైరస్ సోకకుండా సెలబ్రెటీలు సైతం అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అసలు మ్యాటర్ లోకి వస్తే..  హ్యారీపోటర్‌ యాక్టర్ డేనియల్‌ ర్యాడ్‌క్లిఫ్‌కు కూడా వైరస్ సోకినట్లు వార్తలు రావడం అందరిని షాక్ గురి చేసింది. అదికూడా బిబిసి న్యూస్ పేరిట ట్వీట్ వెలువడంతో నిమిషాల్లో ఆ ట్వీట్ వైరల్ అయ్యింది. కరోనా సోకిన సెలబ్రేటిస్ లో ప్రముఖ వ్యక్తి ర్యాడ్‌క్లిఫ్‌ ఒకరని పేర్కొనడం ఆయన ఫ్యాన్స్ ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ న్యూస్ లో ఎలాంటి నిజం లేదని ర్యాడిక్లిఫ్‌ ప్రతినిధి కొట్టిపరేశారు.

ర్యాడిక్లిఫ్‌ ఆరోగ్యంగానే ఉన్నాడంటూ.. ఆయనకు ఎలాంటి వైరస్ సోకలేదని సమాధానమిచ్చారు. అప్పటికే ఆ ఫేక్ ట్వీట్ కి గంటలోనే మూడు లక్షల లైక్స్ అందాయి. అనంతరం ర్యాడిక్లిఫ్‌ టీమ్ ఇంటర్నేషనల్ మీడియాకు అధికారికంగా ప్రకటన అందించడంతో ర్యాడిక్లిఫ్‌ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.

ఇక నిజం తెలిసిన తరువాత ఫేక్‌ ట్వీట్‌ చేసిన వారిని ఆరా తీయగా ట్వీట్ వైరల్ అవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేశామని అన్నారు. సోషల్ మీడియాలో బాగా పాపులరయిన వ్యక్తుల్లో ర్యాడ్‌క్లిఫ్‌ ఒకరని అతని గురించి ఇలాంటి వార్త పోస్ట్ చేస్తే తప్పకుండా వైరల్ అవుతుందనే నెపంతో ఈ విధంగా చేసినట్లు చెప్పారు.