సినిమాలు, సీరియల్స్ కాకుండా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి హవా బాగా పెరిగిపోయింది. కొత్త కంటెంట్ కోసం డిజిటల్ స్ట్రీమింగ్ కంపనీలు ఎగబడుతున్నాయి. ఉన్న షోలతో కాకుండా కొత్త కొత్త షోలతో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి చూస్తున్నాయి. దీనికోసం అడల్ట్ కంటెంట్ ని బాగా నమ్ముకుంటున్నాయి.

స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై అడల్ట్ థీమ్ ఉన్న వాటికే ఆదరణ బాగుండడంతో అలాంటి షోలు, వెబ్ సిరీస్ లు చేయడానికి కంపనీలు ఇంటరెస్ట్ చూపిస్తున్నాయి. దీనికోసం ప్రస్తుతం అవకాశాలు లేకుండా ఖాళీగా ఉన్న హీరోయిన్లను ఎన్నుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అందాల ఆరబోత చేస్తోన్న హీరోయిన్లకి మేకర్స్ నుండి ఫోన్లు వెళ్తున్నాయి.

అందాల షోతో హద్దులు చెరిపేస్తోన్న జాన్వీ..!

న్యూడ్ గా కనిపించడం తప్ప మిగిలిన అన్నింటికీ ఒప్పుకుంటేనే అవకాశాలు ఇస్తున్నారు. ఒకసారి అగ్రిమెంట్ చేసుకున్న తరువాత అవి చేస్తాను, ఇవి చేయను లాంటి మాటలు మాట్లాడడానికి వీలు ఉండదు. దీనికోసం హీరోయిన్లకు భారీ ఎత్తున రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేస్తున్నారు.

సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో డీలా పడ్డ కొందరు హీరోయిన్లకు ఇలా వెబ్ సిరీస్ లతో లక్షల్లో ఆదాయం వస్తుండడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అవకాశాలు వస్తున్నాయని తెలుసుకున్న మిగతావారు కూడా పరిమితికి మించి అందాలు ఆరబోస్తూ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి వెబ్ సిరీస్ ల ద్వారా మన సీనియర్ భామలకు మంచి ఆప్షన్ దొరికిందనే చెప్పాలి. త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి కూడా సెన్సార్ వస్తుందని అంటున్నారు. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!