యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' సినిమాలో కీలక పాత్ర పోషించిన ఎవ్లిన్ శర్మకి పెళ్లి కుదిరింది. త్వరలోనే ఈ బ్యూటీ తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతుంది. ఆస్ట్రేలియాకి చెందిన తుషాన్ అనే వ్యక్తితో కొంతకాలంగా డేటింగ్ చేస్తోన్న ఎవ్లిన్ ఇప్పుడు అతడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

వీరి ప్రేమకి ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో సోమవారం నాడు నిశ్చితార్ధం చేసుకున్నారు. తుషాన్ ఆస్ట్రేలియాలో డెంటల్ సర్జన్.. ఇతడికి పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. సోమవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని ప్రముఖ హార్బర్ బ్రిడ్జ్ సమీపంలో ఓ పడవపై వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తుషాన్ ని ముద్దాడుతూ తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఎవ్లిన్.

తన కల నిజమైందని చెప్పింది ఎవ్లిన్. గతేడాది ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా తుషాన్ ని కలిసినట్లు.. తుషాన్ చాలా రొమాంటిక్ అని.. ఇంకా పెళ్లి తేదీ ఖరారు కాలేదని.. అన్నీ కుదిరిన తరువాత ప్రకటిస్తానని.. ప్రస్తుతమైతే ఇద్దరం లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. పెళ్లి అయిన తరువాత తుషాన్ తో ఆస్ట్రేలియా వెళ్లిపోవాలనుకుంటున్నట్లు చెప్పింది.

తుషాన్ కి తన గురించి బాగా తెలుసనని.. తనను ఎంతో ప్రేమిస్తాడని చెప్పింది. హిందీలో ‘యే జవానీ హై దివానీ’, ‘యారియా’ తదితర చిత్రాల్లో ఎవ్లిన్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించింది. తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా 'సాహో'. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Yessss!!! 🥰💍🥳😍🤩

A post shared by Evelyn Sharma (@evelyn_sharma) on Oct 7, 2019 at 7:24pm PDT