సంక్రాంతి బాక్స్ ఆఫీస్ పోటీలోకి మరో హీరో కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా! సినిమా నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముందుగా సినిమా  ప్రీమియర్స్ ను(USA) ప్రవాసులు చూసేశారు. ఓవర్సీస్ లో పరవలేదనిపించే విధంగా సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. అయితే వాటికి అనుకున్నంతగా ఆదరణ అయితే దక్కలేదు.

సినిమా టాక్ ని బట్టి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక సినిమా విషయానికి వస్తే.. గతంలో ఎప్పుడు లేని విధంగా కళ్యాణ్ రామ్ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ట్యాగ్ తో ఆడియెన్స్ ని ఆకర్షించడానే చెప్పాలి. శతమానంభవతి వంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాకు దర్శకత్వం వహించడం సినిమాకు కొంత బజ్ ని క్రియేట్ చేసింది.

ఇక సినిమాలో కళ్యాణ్ రామ్ ఓ వైపు 'రాముడు మంచి బాలుడు' అనే టైప్ లో నటిస్తూనే మరోవైపు తన లోని యాక్షన్ ని కూడా కథకు తగ్గట్టుగా ప్రజెంట్ చేశాడు.  కథలో ప్రతి పాత్రను కలుపుకుంటూ.. వెళ్లిన విధానం బాగా వర్కౌట్ అయ్యింది. కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ తో పాటు ఎమోషన్స్ లో ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా నటించడానే చెప్పాలి. హీరోయిన్ మెహ్రీన్ కూడా తనదైన శైలిలో చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది.

ఇక సినిమాలో కథ కన్నా స్క్రీన్ ప్లేతో దర్శకుడు తన పనితనాన్ని చూపించాడు. అయితే అక్కడక్కడా రొటీన్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడం సాంగ్స్ కూడా అనుకున్నంతగా వర్కౌట్ కాకపోవడం సినిమాపై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. అయితే ఈ కాన్సెప్ట్ గనక క్లిక్కయితే పండగ సీజన్ లో సినిమా మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఫైనల్ గా సినిమా అయితే ప్రవాసుల నుంచి పరవలేదనిపించే విధంగా టాక్ అందుకుంటోంది. మరీ లోకల్ ఆడియెన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.