కళ్యాణ్ రామ్ - మెహ్రీన్ కౌర్ పిర్జాద జంటగా నటించిన చిత్రం ఎంత మంచివాడవురా! గతంలో ఎప్పుడు లేని విదంగా కళ్యాణ్ రామ్ రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్న సమయంలో తన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని రిలీజ్ చేస్తున్నాడు. నేడు వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీమియర్స్ ముగిశాయి. సినిమాను చూసిన చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.

ఎంత మంచివాడవురా! అంటూ టైటిల్ తోనే ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసిన కళ్యాణ్ రామ్ సినిమాలో కొత్తగా కనిపిస్తున్నాడు. టీజర్ ట్రైలర్స్ తోనే సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈవెంట్ తో ఎన్టీఆర్ కాస్త బూస్ట్ కూడా ఇచ్చాడు. మొత్తానికి కాస్త బజ్ తో ఓ వర్గం ఆడియెన్స్ ని ఆకర్షించిన ఈ మంచి సినిమా అనుకున్నంతగా పాజిటివ్ టాక్ ను అందుకోవడం లేదని తెలుస్తోంది.  చాలా వరకు సినిమా అంతగా వర్కౌట్ కాలేదని టాక్ వస్తోంది.

ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉందని చెబుతున్నారు. ఇక సినిమాలో ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే.. అది వెన్నెల కిషోర్ పాత్రే అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక నందమూరి ఫ్యాన్స్ నుంచి కళ్యాణ్ రామ్ సినిమాలో అద్భుతంగా కనిపిస్తున్నాడని టాక్ వస్తోంది. ఫైనల్ గా ఎంత మంచివాడవురా అయితే.. ఈ సంక్రాంతి ఫైట్ లో నిలదొక్కుకోవడం కష్టమే అని చెబుతున్నారు. అయితే అల..వైకుంటాపురములో - సరిలేరు నికేవ్వరు సినిమాలపై కూడా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ రెండు సినిమాల కలెక్షన్స్ బావున్నాయి. సో.. ఎంత మంచివాడవురా! కూడా అలాంటి దారిలోనే వెళుతుందో లేదో చూడాలి.