ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో హీరో రామ్ తన తదుపరి సినిమాకు రెడీ అవుతున్నాడు. అనేక కథలు విన్న తర్వాత నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమలకు రామ్ మరో సారి అవకాశం ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి చిత్రాలు వచ్చాయి. 

వీరిద్దరి కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ 'తడం' అనే తమిళ బ్లాక్ బస్టర్ మూవీకి రీమేక్ గా రాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో రామ్ ఇద్దరు యంగ్ బ్యూటీలతో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' చిత్రంలో నటించిన నివేత పేతురాజ్, యంగ్ హీరోయిన్ మాళవిక శర్మ ఈ చిత్రం కోసం హీరోయిన్లుగా ఎంపికైనట్లు టాక్. ఇస్మార్ట్ శంకర్ లో నిధి అగర్వాల్, నభా నటేష్ లతో రామ్ రొమాన్స్ చేశాడు. మారోసారి రామ్ ఇద్దరు హీరోయిన్ల సెంటిమెంట్ ని కొనసాగిస్తున్నాడు. 

ఇస్మార్ట్ శంకర్ చిత్రం రామ్ కు మాస్ లో విపరీతమై క్రేజ్ తీసుకువచ్చింది. ఈ ఇమేజ్ ని నిలబెట్టుకోవాలంటే రామ్ తదుపరి చిత్రం కూడా విజయం సాధించాలి. మరి ఈ ఎనర్జిటిక్ స్టార్ తన తదుపరి చిత్రం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి.