ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్ లోనే ఇస్మార్ట్ శంకర్ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇస్మార్ట్ శంకర్ మూవీలో రామ్ అదిరిపోయే పెర్ఫామెన్స్ అందించాడు. యాక్షన్ సన్నివేశాల్లో, డాన్సులతో అదరగొట్టాడు. అదే ఉత్సాహంతో రామ్ కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. 

రామ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్ర విశేషాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణంలో చిత్ర యూనిట్ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి 'రెడ్' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు. రామ్ విభిన్నమైన లుక్ లో అదిరిపోయేలా కనిపిస్తున్నాడు. 

రెడ్ మూవీ ఫస్ట్ లుక్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటోంది. కిషోర్ తిరుమల, రామ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. వీరిద్దరి కాంబోలో ఇదివరమే నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాలు వచ్చాయి. 

రామ్ హోమ్ ప్రొడక్షన్ లోనే ఈ చిత్రం తెరక్కుతోంది. స్రవంతి మూవీస్ బ్యానర్ పై రామ్ బాబాయ్ రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. నివేత పేతురాజ్, యంగ్ బ్యూటీ మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తంగా రామ్ కొత్త చిత్రం రెడ్ ఫస్ట్ లుక్ తోనే అందరిని ఆకర్షించింది. 

ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించిన తడం మూవీకి రీమేక్ గా తెరక్కుతోంది. తమిళంలో అరుణ్ విజయ్ హీరోగా నటించాడు. ఈ ఏడాది మార్చ్ లో విడుదలైన తడం ఘనవిజయం సొంతం చేసుకుంది.