సాధారణంగా డబ్బులు తీసుకుని రకరకాల కంపెనీల బ్రాండ్ లను ప్రమోట్ చేస్తూంటారు సెలబ్రెటీలు. అదే తామే ఓ ప్రొడక్ట్ పెట్టుకుంటే ఎవరో వచ్చి తమ ప్రొడక్ట్ ని ప్రమోట్ చెయ్యాల్సిన పని ఉండదు. తామే ఇంచక్కా రూపాయి ఖర్చు లేకుండా చేసేసుకోవచ్చు. ఈ విషయం కొన్నాళ్లు వేరే ప్రొడక్ట్స్ కు పనిచేసాక అర్దమవుతుంది. దాంతో మెల్లిగా తమ సొంత ప్రొడక్ట్ లు లాంచ్ చేయటం మొదలెడతారు. అలాంటి సెలబ్రెటీలు హాలీవుడ్ లో మరీ ఎక్కువ. ఆ బ్యాచ్ లో ఆ మధ్యనే చేరింది 

ఎమిలీ రాటజ్కోవ్స్కీ.   మ్యూజిక్ వీడియోలతో పాపులరైన ఆమె చాలా పాపులర్ మోడల్. అమెరికాలో ఆమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు.
 
ఈ ఇరవై ఎనిమిదేళ్ల ఈ అందగత్తె రీసెంట్ గా Inamorata అనే స్విమ్ వేర్ ని లాంచ్ చేసింది.  దాంతో వేరే వాళ్లని తన బ్రాండ్ కు పెట్టుకుని పబ్లిసిటీ చేసుకునే బదులు..తనే స్వయంగా రంగంలోకి దిగితే బెస్ట్ అనుకుంది. ఈ ఆలోచన రాగానే ఓ రేంజిలో రెచ్చిపోతూ ఇనిస్ట్రగ్రమ్ లో పోస్ట్ లు పెట్టడం మొదలెట్టింది.

 ఈ బ్రాండ్ ప్రమోషన్ లో ఆమె హద్దులు దాటుతోందని విమర్శలు వస్తున్నా పట్టించుకోవటం లేదు. ఆమె టాపెలెస్ పిక్చర్స్ , లింగరీ తో తో ఉన్న ఆమె అందాలను ఎగ్జిబిట్ చేస్తూ షేర్ చేస్తోంది. తన సొంత ప్రొడక్టు ప్రమోషన్ లో హద్దులు దాటుతోందని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఉమెన్ రైట్ టు ఛూజ్ అనే ఆర్టికల్ ని సైతం రాసి షేర్ చేసింది. 

ఇక ఎమిలీ...మోడలింగ్ లోనే కాకుండా నటిగానూ బిజి అవ్వాలనే ప్రయత్నాల్లో ఉంది. వచ్చే సంవత్సరం తనలో నటిని చూస్తారు అందాన్ని కాదు అంటోంది. గాన్ గర్ల్ లో నటించిన ఆమెకు పెద్దగా పేరు రాలేదు. కానీ త్వరలో తాను చేయబోయే ప్రాజెక్టులపై చాలా నమ్మకంగా ఉంది. ఈ లోగా ఆమె షేర్ చేసిన వీడియో ని చూసేయండి.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

@inamorataswim IS LIVE! Check it out in my bio✨swim by me!

A post shared by Emily Ratajkowski (@emrata) on Nov 16, 2017 at 8:58am PST