సైరా అనంతరం మెగాస్టార్ మరో డిఫరెంట్ జానర్ ని సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాను అఫీషియల్ గా లాంచ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి మరికొన్ని రోజుల్లో సినిమా షూటింగ్ ని మొదలుపెట్టనున్నాడు.

ఇకపోతే దర్శకుడు కొరటాల శివ నటీనటులను కూడా ఫైనల్ చేస్తున్నాడు.  ఈ ప్రాజెక్ట్ లో అనుకోకుండా తెలుగమ్మాయికి ఒక అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు. తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ. గత కొంత కాలంగా హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్న ఈషా రెబ్బా అవకాశాలు అందుకుంటున్నప్పటికీ స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో సక్సెస్ అందుకోవడం లేదు.

పెద్ద హీరోల సరసన నటించేందుకు గ్లామర్ పాత్రలకు కూడా సిద్ధమంటూ కొన్ని హాట్ ఫొటోలతో హింట్ ఇస్తోంది. ఇకపోతే కొరటాల శివ ఆమెను సెలెక్ట్ చేసుకోవడానికి కారణమేంటి అనే కామెంట్స్ వస్తున్నాయి. కథను మలుపు తిప్పే ఒక తెలుగమ్మాయి పాత్రలో ఈషా రెబ్బ కనిపించనున్నట్లు టాక్ వస్తోంది. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ ఎపిసోడ్స్ లో కూడా ఈషా పాత్ర హైలెట్ అని తెలుస్తోంది. మెగాస్టార్ సరసన అవకాశం దక్కించుకుంది అంటే అమ్మడు తప్పకుండా స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే రేంజ్ కి వచ్చినట్లే.

అయితే ఆ పాత్ర ఎలా ఉండబోతోంది అన్నదే బిగ్ మిస్టరీ. సాధారణంగా కొరటాల సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలు కథకి దూరంగానే ఉంటాయి. పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. మరి ఇప్పుడు ఈషా లాంటి బ్యూటీకి ఎలాంటి పాత్రని ఇస్తారో చూడాలి. ఇక సినిమాలో హీరోయిన్ గా త్రిషను అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది. అయితే ఇంకా రూమర్స్ పై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.