సినిమా ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ కి చాలా వరకు వారి వారసులు మంచి హీరోలుగా ఎదగాలని కోరుకుంటారు. అందులో నిర్మాతలకు ఆ కోరిక చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు RRR నిర్మాత డివివి.దానయ్య కూడా అదే తరహాలో తన కొడుకుని గ్రాండ్ గా లాంచ్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకు ఏ మాత్రం వెనుకాడకుండా ఖర్చు చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

 

ఇక ఒక దర్శకుడికి భారీ పారితోషికాన్ని అఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు. చిన్న పాయింట్ తో మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తెరకెక్కించే దర్శకుడు మారుతి. ఈ ప్రాజెక్ట్ కోసం మారుతికి 6కోట్ల వరకు పేమెంట్ అందినట్లు టాక్ వస్తోంది. గతంలోనే తేజకు ఈ అఫర్ చేసినప్పటికీ అప్పుడు వేరే సినిమాలతో బిజిగా ఉండడంతో చేయలేకపోయాడట. 

ఇక ఇప్పుడు మారుతి దానయ్య అఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మారుతి ప్రతిరోజు పండగే రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ - రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమాకు సంబందించిన ఒక పాయింట్ ని ఇప్పటికే ఒకే చేసిన దానయ్య ఫుల్ స్క్రిప్ట్ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ చెప్పారట. ఇక ఇప్పటికే దానయ్య కుమారుడు యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబినేషన్ పై స్పెషల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది.