మాజీ క్రీడాకారిణి, నటి ప్రాచీ తెహ్లాన్ పెళ్లిపీటలెక్కారు. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త రోహిత్ సరోరాతో ఆమె వివాహం శుక్రవారం జరిగింది. ఈ మేరకు తన వివాహానికి సంబంధించిన తొలి ఫొటోను ప్రాచీ అభిమానులతో పంచుకున్నారు. 

ఇన్‌స్టాగ్రాం వేదికగా తన వివాహ ఫోటోను ఆమె షేర్ చేశారు. దీనికి ‘7.8.2020.. వివాహ తేదీ’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. ఇదిలా ఉంటే హిందీ సీరియల్ దియా ఔర్ బాతీ హమ్‌లో ప్రాచీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సీరియల్ ద్వారా ఆమె అనేకమంది అభిమానులను సంపాదించుకున్నారు. 

అంతేకాకుండా ఆమె భారత నెట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో ఆమె కెప్టెన్సీలోనే నెట్‌బాల్‌ పోటీల్లో జాతీయ జట్టు పోటీ చేసింది. కాగా.. ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.