దివ్య భారతి అతి పిన్న వయసులోనే తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. 90 వ దశకంలో కుర్రకారుని ఉర్రూతలూగించింది. కేవలం 19 ఏళ్లకే ఆమె జీవితాన్ని మృత్యువు కబళించింది. ప్రమాదవశాత్తూ ఆమె భవంతిపై నుంచి పడి 1993లో మృతి చెందింది. 

1993లో దివ్య భారతి సంజయ్ కపూర్ సరసన కర్తవ్య అనే చిత్రానికి సైన్ చేసింది. ఆ చిత్ర షూటింగ్ సమయంలో దివ్య భారతి తన 19వ జన్మదిన వేడుకని జరుపుకుంది. చిత్ర యూనిట్ సెట్స్ లోనే దివ్యభారతి బర్త్ డే పార్టీ ఏర్పాటు చేశారు. అప్పటి ఫోటో ప్రస్తుతం సామజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. 

20 ఏళ్ళు కూడా నిండని దివ్య భారతి పాలబుగ్గలతో క్యూట్ కాగా కనిపిస్తోంది. ఈ ఫొటోలో సంజయ్ కపూర్, నటి మౌషమి ఛటర్జీ తదితరులు ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే దివ్య భారతి ప్రమాదం వల్ల మరణించింది. 

అప్పటికి ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించారు. దివ్యభారతి మరణం తర్వాత ఆమె స్థానంలోకి జుహీ చావ్లాని హీరోయిన్ గా తీసుకున్నారు.