ప్రముఖ బాలీవుడ్ నటి, మోడల్ దివ్య చౌక్సే కేన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. ‘హై అప్పా దిల్ తో అవారా’ చిత్రంలో నటించిన దివ్య చౌక్సే చాలా కాలంగా కాన్సర్ తో పోరాడుతూ మృతి చెందారు. దివ్య చౌక్సే మృతిపై ఆమె సన్నిహితుడు సౌమ్య అమిష్ వర్మ సంతాప సందేశం ద్వారా ధ్రువీకరించారు. 

29 సంవత్సరాల చిరుప్రాయంలోనే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది. లండన్ లో అచ్తింగ్ కోర్స్ పూర్తి చేసి వచ్చిన దివ్య రెండు సినిమాలు, సీరియల్స్, అనేక యాడ్స్ లో కనిపించింది. మ్యూజిక్ ఆల్బం ని కూడా విడుదల చేసింది. 

గత సంవత్సరంన్నర కాలంగా కాన్సర్ తో పోరాటం చేస్తుంది. ఈ నెల 11వ తేదీన ఆమె తన సోషల్ మీడియాలో అకౌంట్ లో బాధాతప్త హృదయంతో ఒక మెసేజ్ ని పెట్టింది. గత కొన్ని నెలలుగా తాను కనిపించకుండా పోయానని, డెత్ బెడ్ పై ఉన్నానని ఆమె రాసుకొచ్చారు. వచ్చే జన్మంటూ ఉంటే ఈ వేదన ఉండకూడదు అని కోరుకుంటున్నట్టుగా ఆమె తెలిపారు. 

ఆమె మరణ వార్త విని చాలా మంది సెలెబ్రిటీలు తమ సంతాపసందేశాలను తెలిపారు.