సినిమా బిజినెస్ అంటేనే రిస్క్..కానీ ఆ పీల్డ్ లో వాళ్లు నిరంతరం రిస్క్ తీసుకోవటానికి భయపడుతూనే ఉంటారు. అలాగే హిట్ వస్తే ఆ హీరో లేదా దర్శకుడు లేదా నిర్మాత వెనకబడి కంటెంట్ ఎలా ఉన్నా చూసుకోకుండా కోట్లు పెట్టి కొనేస్తారు. అదే ఒక సినిమా తేడా కొడితే ఆ తర్వాత చిత్రం పోస్టర్ చూడటానికి కూడా డిస్ట్రిబ్యూటర్స్ ఇష్టపడరు. ఇప్పుడు రవితేజ తాజా చిత్రం పొజీషన్ అలానే ఉంది. ఇంతకు ముందు రవితేజ సినిమా అంటే కళ్లు మూసుకుని ఎగబడే డిస్ట్రిబ్యూటర్స్..ఇప్పుడు మొహమాటం లేకుండా మాట కూడా వినకుండా నో చెప్పేస్తున్నారు.

'మిర్చి' ఐటెం భామ గ్లామర్ హీట్ తట్టుకోగలరా.. ఫొటోస్ వైరల్

ప్రస్తుతం రవితేజ కెరీర్ లో వరస్ట్ ఫేజ్ నడుస్తోంది. వరస పెట్టి డిజాస్టర్స్ వస్తున్నాయి. ఓ మాదిరి సినిమాలు కూడా ఆడటం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన డిస్కోరాజా సినిమా కూడా డిజాస్టర్ అవటం ఆయన్ని బాగా నిరాశపరిచింది. సినిమా ఫరవాలేదు అన్నా అన్ సీజన్ తో భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ లేవు. ఈ ప్రభావం ఆయన తదుపరి చిత్రం క్రాక్ బిజినెస్ పై పడిందని సమాచారం.

దర్శకుడు గోపిచంద్ మలినేని సైతం క్రేజ్ లేకపోవటం, శృతి హాసన్ సైతం ఫేడవుట్ అయ్యి ఉండటం ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. దాంతో రవితేజ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఇంట్రస్ట్ చూడటం లేదని ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్దగా లేదని, లో బజ్ తో రిలీజ్ అవుతుందని అంటున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక మ్యాజిక్ జరిగితే తప్ప ఒడ్డున పడలేమని అంటున్నారు.

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ -క్రాక్. వచ్చే మే 8న క్రాక్‌ను థియేటర్లకు తేనున్నట్టు నిర్మాత ఠాగూర్ మధు ఇప్పటికే ప్రకటించారు.   ప్రస్తతం సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్న క్రాక్ చిత్రంలో రవితేజతో శృతిహాసన్ రొమాన్స్ చేయనుంది.

అన్నివర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఇంటెన్స్ స్టోరీతో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చిత్రం టీమ్ చెబుతోంది. తమిళ నటులు సమద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సరస్వతి ఫిల్మ్ డివిజన్‌పై బి మధు నిర్మిస్తోన్న చిత్రానికి తమన్ సంగీతం, జికె విష్ణు సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు.