ఈ ఏడాది స్టార్టింగ్ లోనే అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో బన్నీ కి జోడీ పూజ హెగ్డే నటించింది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తో మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు బన్నీ. అదే జోరు లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టాడు.

అల వైకుంఠపురములో సినిమా తరువాత లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్లో ఓ సినిమా ను ప్రకటించాడు బన్నీ. పుష్ప పేరుతో రూపొందుతున్న ఈ సినిమా లో బున్నుకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా కొంత భాగం పూర్తయింది. అయితే బన్నీ మాత్రం ఇంకా షూటింగ్ లో జాయిన్ కాలేదు. ఈ లోగా కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించటం తో షూటింగ్ ఆగిపోయింది. అయితే ఆ గాప్ లో ప్రొడక్షన్ కార్యక్రమాలు కానిచ్చేస్తున్నారు సుకుమార్.

సుకుమార్ ప్రతీ సినిమా లోనూ ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఆ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. పుష్ప లోనూ అలాంటి ఐటమ్ నంబర్ ను ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అంతే కాదు ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ రూపొందుతుండటం తో ఇతర నటీ నటులను కూడా జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న వారిని సెలెక్ట్ చేస్తున్నాడు. అందుకే పుష్ప లోని ఐటమ్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మకు సెలెక్ట్ చేశాడట. పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన లో ఫర్ సినిమా తో వెండి తెరకు పరిచయం అయిన బ్యూటీ దిశా పఠాని ని పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సంప్రదించారు. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.