గత కొన్నిరోజుల కృత జరిగిన దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనానికి దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఘటన అనంతరం నిందితులను ఎన్ కౌంటర్ విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ న్యూస్ పై సినీ ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేశారు. అమ్మయిలపై అత్యాచారం చేస్తే తగిన శిక్షలు వెంటనే అమలు చేయాలనీ సినీ హీరోలు స్పెషల్ గా ట్వీట్ చేస్తున్నారు.

అయితే బాలకృష్ణ మాత్రం తన నెక్స్ట్ సినిమాలో అమ్మయిల హత్యాచార ఘటనకు సంబందించిన విషయాన్నీ ప్రస్తావించనున్నాడట. ఎన్ కౌంటర్ జరిగిన రోజే బాలకృష - బోయపాటి కాంబినేషన్ సినిమా స్టార్ అయ్యింది. అయితే ఘటన జరిగిన రోజు రాత్రి బాలకృష్ణ సినిమా స్క్రిప్ట్ లో ఒక చేంజ్ చేయమని అడిగారట. దిశ ఘటనను ఆధారంగా చేసుకొని మంచి సందేశం ఇచ్చేలా సీన్ క్రియేట్ చేయాలనీ బోయపాటిని బాలయ్య డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

బోయపాటి తనదైన శైలిలో ఎమోషన్ ని క్రియేట్ చేస్తూనే పవర్ఫుల్ వార్నింగ్ తో మెస్సేజ్ ఇవ్వగలడు. ఇక దిశ ఘటన ఆధారంగా ఆయన ఎలాంటి సీన్స్ ని క్రియేట్ చేస్తారో చూడాలి. సినిమా లాంచ్ ఈవెంట్ లో కూడా బోయపాటి ఎమోషనల్ గా మాట్లాడారు. బలకృష్ణ కూడా పోలీసుల పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో మొదలుకానుంది. వచ్చే ఏడాది వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు.