'రాజా ది గ్రేట్' అనంతర సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడనుకున్న మాస్ రాజా మళ్ళీ 'నెల టిక్కెట్టు - టచ్ చేసి చూడు - అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలతో డిజాస్టర్ ఊబిలో ఇరుక్కుపోయాడు. ఇప్పుడు డిస్కో రాజా అనే సైన్స్ ఫిక్చన్ తో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని అనుకుంటున్నాడు. నేడు వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా ప్రీమియర్ షోలను వీక్షించిన అభిమానులు సినిమాపై వారి అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తేలియాజేస్తున్నారు.

స్కై ఫై డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా మాస్ రాజా అభిమానులను ఏ మాత్రం నీరాశపరచదని టాక్ వస్తోంది. సినిమాలో రవితేజ యాక్టింగ్ సూపర్ గా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇక నభా నటేష్ మరోసారి తన యాక్టింగ్ తో అదరగొట్టేసిందని అంటున్నారు. సింగిల్ లైన్ లో బొమ్మ హిట్టు అని రవితేజ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం కాయమని చెబుతున్నారు. ఇకపోతే థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ సినిమా చూసే ఆడియెన్స్ కి మంచి ఫీల్ ని కలిగిస్తుందని సెకండ్ హాఫ్ ఎక్కువగా నచ్చిందని చెబుతున్నారు.

ఇప్పటివరకైతే సినిమాపై అభిమానులు పాజిటివ్ టాక్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చెప్పలేము. యూఎస్ లో అలాగే ఇండియాలో పలు చోట్ల ప్రీమియర్స్ ని ముగించుకున్న డిస్కో రాజా మిగతా ఆడియెన్స్ నుంచి యావరేజ్ టాక్ అందుకుంటోంది. ఫైనల్ రిజల్ట్ ఏమిటనేది ఈవినింగ్ వరకు తేలిపోతుంది. మరీ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.