మాస్ మహారాజా రవితేజ కెరీర్ డేంజర్ జోన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఎలాగైనా సక్సెస్ అందుకొని సేఫ్ జోన్ లోకి రావాలని ప్రస్తుతం డిస్కోరాజా సినిమాతో సిద్దమవుతున్నాడు. రాజా ది గ్రేట్ సినిమా అనంతరం వరుస అపజయాలతో సతమతమవుతున్న మాస్ రాజాకు ఈ సినిమా మంచి హిట్ ఇస్తుందని ఇండస్ట్రీలో ఇప్పటికే ఒక టాక్ వైరల్ అయ్యింది.

ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైన్ ఫిక్చన్ థ్రిల్లర్ మూవీలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రలతో కనిపించనున్నాడు. ఇకపోతే సినిమాను జనవరి 24న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. అసలైతే డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో జనవరి ఎండ్ కి సినిమాని విడుదల చేస్తున్నారు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా చిత్ర యూనిట్ ఒక డేట్ ని ఫిక్స్ చేసుకుంది.  జనవరి 18న హైదరాబాద్ లోనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనున్నారు. అందుకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. సంక్రాంతికి మహేష్ - బన్నీ సినిమాల హడావుడి ముగిసిన అనంతరం డిస్కోరాజా బజ్ ని పెంచాలని మాస్ రాజా స్పెషల్ ప్లాన్ వేసుకున్నాడు.

మరి సినిమా ఈ సీనియర్ హీరోకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. SRT ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన నాభా నటేష్ - పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.