గతకొన్నేళ్ళుగా అపజయాలతో సతమతమవుతున్న సీనియర్ హీరోల్లో మాస్ రాజా రవి తేజ ఒకరు. రాజా ది గ్రేట్ సినిమాతో ఫామ్ లోకి వచ్చాడని అనుకున్న ఈ హీరో హ్యాట్రిక్ డిజాస్టర్ రికార్డ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన డిస్కో రాజా కూడా అనుకున్నంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం సినిమా కలెక్షన్స్ లో ఎలాంటి హడావుడి కనిపించడం లేదు.

సినిమా మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ అందుకోవడంతో జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. టచ్ చేసి చూడు - నేల టిక్కెట్టు అపజయాల అనంతరం శ్రీను వైట్లతో చేసిన అమర్ అక్బర్ ఆంటోని కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమాలు చేదు అనుభవాన్ని ఇవ్వడంతో రొటీన్ గా గా కాకుండా డిఫరెంట్ గా హిట్టు కొట్టాలని సైన్స్ ఫిక్చన్ కథ కాన్సెప్ట్ తో తెరకెక్కిన డిస్కో రాజాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ప్రస్తుతం సినిమాకు సంబందించిన కలెక్షన్స్ పై చిత్ర యూనిట్ కూడా ఏ విధంగా స్పందించడం లేదు. దీంతో డిస్కో రాజా ప్రమోషన్స్ డోస్ పెంచే ప్రయత్నం చేసున్నప్పటికీ బజ్ కనిపించడం లేదు. 22కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డిస్కో రాజా సగం కూడా రాబట్టలేకపోయినట్లు తెలుస్తోంది. వీకెండ్ అనంతరం కలెక్షన్స్ చాలా తగ్గాయి.

విఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు థమన్ ఇచ్చిన సంగీతం మొదట్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.  సినిమాలో రెండు సాంగ్స్ బాగానే క్లిక్కయ్యాయి. అయినప్పటికి మాస్ రాజా బ్యాడ్ లక్ మారలేదు. ఇక నెక్స్ట్ రవితేజ క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయనున్న ఆ సినిమా సమ్మర్ లో  విడుదల కానుంది. మరీ ఆ సినిమాతో అయినా ఈ సీనియర్ హీరో ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.