ఈ రోజు రిలీజ్ అవుతున్న డిస్కోరాజా పరిస్దితి చిత్రంగా ఉంది.  ‘స‌రిలేరు’ వైపు ఆశగా చూస్తోంది. ఆ థియోటర్స్ ఖాళీ చేస్తేనే తనకు కాస్త రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతి పండగ సినిమాల్లో అల వైకుంఠ‌పుర‌ములో  ఇంకా అదరకొడుతోంది. దాంతో ఎట్టి పరిస్దితుల్లోనూ మరి కొంత కాలం దాకా థియోటర్స్ నుంచి అల వైకుంఠ‌పుర‌ములో  ఖాళీ చేయదు. దాంతో డిస్కోరాజా దృష్టి పూర్తిగా సరిలేరు పై ఉంది.

డిస్కో రాజా ప్రీమియర్ షో టాక్

వీకెండ్ దాటిన నాటి నుంచి స‌రిలేరు  బాగా డ్రాప్ అయ్యింది. ఈ సినిమాకి 20 నుంచి 30 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉంది. ఆ థియేట‌ర్ల‌న్నీ ‘డిస్కోరాజా’కి ఇవ్వాలి. కానీ.. ఈ వీకెండ్ కూడా వ‌సూళ్లు వ‌స్తాయేమో అని ‘స‌రిలేరు..’ ఎదురు చూడటమే దెబ్బ కొడుతోంది. దాంతో సరిలేరు  థియేట‌ర్లు వ‌దులుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు. దానికి తోడు సరిలేరు సినిమాకు మరికొన్ని సీన్స్ యాడ్ చేసి, ప్రమోషన్ ఈవెంట్ చేస్తామంటోంది టీమ్. అంటే సరిలేరు సినిమాని ఇంకొన్ని రోజులు థియోటర్స్ లో ఉంచాలనే నిర్మాతల ప్రయత్నం అని అర్దమవుతోంది.

దాంతో డిస్కోరాజా టాక్ బాగుండి, థియేట‌ర్ య‌జ‌మానుల నుంచి ‘మాకు డిస్కోరాజానే కావాలి’ అని డిమాండ్ చేస్తే త‌ప్ప‌  వేరే దారి లేదు. దానికి తోడు ర‌వితేజకు అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. వరస ఫ్లాఫ్ ల్లో ఉండటం డిస్కోరాజాని వెనక్కి నెట్టేస్తోంది. ఈ క్రమంలో డిస్కోరాజా లాంటి పెద్ద సినిమాకి కావ‌ల్సిన‌న్ని థియేట‌ర్లు అందుబాటులో లేకుండాపోయాయి.