రోజు రోజుకీ పరిస్దితులు మారిపోతున్నాయి. డైరక్ట్ థియోటర్ లో సినిమా చూసే ప్రస్తుతానికి లేదు. కరోనాతో విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని చిత్ర పరిశ్రమలు అయోమయంలో ఉన్నాయి. ఇప్పట్లో షూటింగులు గాని సినిమాల రిలీజ్ లు గాని ఉండేలా కనిపించడం లేదు. ఒకవేళ లాక్ డౌన్ తర్వాత రిలీజ్ చేద్దామంకున్న జనాలు ఎంతవరకు థియోటర్స్ కి వస్తారన్నది గ్యారెంటీ లేదు. దాంతో సౌత్ అండ్ నార్త్ చిత్ర పరిశ్రమ మేకర్స్ దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా సినీపరిశ్రమపైనే కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని విశ్లేషకలు అభిప్రాయపడుతున్నారు. దాంతో కొందరు స్టార్ హీరోలు.. నిర్మాతలు అమెజాన్- నెట్ ఫ్లిక్స్ లాంటి ఓ టి టి ప్లాట్ ఫాం లో తమ రిలీజ్ చేసేయడమే తప్ప ఇంకో దారి లేదని భావిస్తున్నారు

 ఈ నేపధ్యంలో అప్పటిదాకా పెద్దగా ఊపందుకోని ఓటీటి మార్కెట్ ఒక్కసారిగా పరుగు ప్రారంభించింది. ఎక్కడక్కడి వెబ్ సీరిస్ ల నిర్మాణం మొదలైంది. ముఖ్యంగా అమేజాన్ ప్రైమ్ వారు లోకల్ కంటెంట్ తో మార్కెట్ ని గ్రాబ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందకు తగినట్లుగా ప్లాన్స్ వేస్తున్నారు. వెబ్ సీరిస్ లు రెడీ చేస్తున్నారు. ఇంతకాలం సినిమాలే చేస్తానని పట్టుబట్టుకు కూర్చున్న వారు సైతం ప్రస్తుత బయిట పరిస్దితులు చూసి బెండ్ అవుతున్నారు. అలాంటి వారిలో డైరక్టర్ తేజ కూడా ఒకరని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆయన అమేజాన్ ప్రైమ్ తో మూడు వెబ్ సీరిస్ లకు సైన్ చేసినట్లు సమాచారం. 

సురేష్ బాబు, అల్లు అరవింద్ వంటి పెద్ద నిర్మాతలు సైతం...భ‌విష్య‌త్తులో ఓటీటీ సంస్థ‌ల‌దే రాజ్యం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాక స్టార్ డైరక్టర్స్ సైతం ఓటీటీ కోసం ప‌నిచేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఇవన్నీ అందరినీ ఆలోచనలో పడేస్తున్నాయి. అంతేకాకుండా తేజతో ఓ సినిమాకూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే టాక్స్ జరిగాయని చెప్తున్నారు. చాలా లిమెటెడ్ బడ్జెట్ లో ఈ వెబ్ సీరిస్ లు, సినిమా  పూర్తి చేసి ఇస్తానని తేజ హామీ ఇవ్వటంతో ఈ ప్రాజెక్టు ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది. ఈ మేరకు ఓ అఫీషియల్ ప్రకటన త్వరలోనే రాబోతోందని వినికిడి. 
 
దాంతో ఈ లాక్ డౌన్ పీరియడ్ లో తేజ పూర్తిగా స్క్రిప్టు పనిమీదే దృష్టి పెట్టారట. వెబ్ సీరిస్ ల స్క్రిప్టు లు పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది.  పనిలో పనిగా గోపీచంద్ కోసం ఓ క‌థ‌, రానా కోసం మ‌రో క‌థ రెడీ చేస్తున్నారట. అయితే సినిమా ముందు ప్రారంభం కానుందా ...సినిమా ముందు ప్రారంభం కానుందా తెలియాల్సి ఉంది. ఇక మరికొంతమందితోనూ అమేజాన్ చర్చలు జరుపుతోందని వినికిడి.