యాంకర్ ప్రదీప్ ని అమ్మాయిని వేధించిన కేసులో రెండు రోజుల పాటు జైల్లో పెట్టారని.. సెంట్రల్ ఫిలిం బోర్డ్ రూల్స్ ప్రకారం ప్రదీప్ హీరోగా నటించడానికి అనర్హుడని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మేడ్చల్ జిల్లాకి చెందిన సునిశిత్ అనే దర్శకుడు ఫిర్యాదు చేశాడు.

దీనిపై స్పందించిన ప్రదీప్.. తను ఎవరినీ వేధించలేదని.. జైలుకి కూడా వెళ్లలేదని.. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాజాగా మరోసారి దర్శకుడు సునిశిత్.. ప్రదీప్ పై మండిపడ్డాడు.

నేను ఎవరినీ వేధించలేదు.. జైలుకి వెళ్లలేదు.. యాంకర్ ప్రదీప్!

మొదటినుండి కూడా ప్రదీప్ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని.. పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి సపోర్ట్ ప్రదీప్ కి బాగా ఉందని.. 2014, 2015 నుండే ప్రదీప్.. జనసేన పార్టీ కోసం పని చేస్తున్నారని.. వాళ్ల అండ చూసుకునే సెన్సార్ బోర్డ్ రూల్స్ కి వ్యతిరేకంగా ప్రదీప్ వ్యవహరిస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు.

తను ప్రదీప్ తో సుడిగాలి సుధీర్ తో కొన్ని షోలకు యాంకరింగ్ చేశానని చెప్పిన సునిశిత్.. వారిద్దరూ తనకు మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు. కానీ వారిద్దరూ తనపై కుట్ర పన్నారని.. 'మా' అసోసియేషన్ లో తనపై కంప్లైంట్ కూడా చేశారని.. ఆ సమయంలో శివాజీరాజా అధ్యక్షుడిగా ఉన్నారని చెప్పారు.

ఒకప్పుడు ప్రదీప్ తనతో అన్ని విషయాలు షేర్ చేసుకునేవాడని.. ఇప్పుడు ఇద్దరికీ మాటల్లేవని.. అందుకే అతడి తప్పులను బయటపెడుతున్నానని చెప్పారు. ఒకవేళ ప్రదీప్ గురించి తను చెప్పేవి అబద్దాలని మీకు అనిపిస్తే కేసు పెట్టుకోమని చెప్పాడు సునిశిత్. చాలా మంది తను పబ్లిసిటీ కోసం ప్రదీప్ పై కేసు పెట్టానని అనుకుంటున్నారని.. తనకు అలాంటి ఆశ ఏమీ లేదని.. కావాలంటే తన ఫోటోని, పేరుని ఎక్కడా వాడొద్దని చెప్పాడు.