'కంగ్రాట్స్ రాము తాతయ్య గారు'.. వర్మపై రాజమౌళి సెటైర్లు!
ఈరోజు వర్మ కూతురు రేవతికి ఆడపిల్ల జన్మించింది. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ కామెంట్ చేశారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఎవరి మీదనైనా సెటైర్లు వేయాలంటే ముందుంటాడు. అలాంటిది దర్శకుడు రాజమౌళి.. వర్మపైనే సెటైర్లు వేశాడు. గతంలో చాలా సార్లు రాజమౌళి ట్యాగ్ చేస్తూ వర్మ సోషల్ మీడియాలో కౌంటర్లు వేశాడు.
ఈసారి రాజమౌళికి ఛాన్స్ వచ్చింది. ఈరోజు వర్మ కూతురు రేవతికి ఆడపిల్ల జన్మించింది. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ కామెంట్ చేశారు. ''కంగ్రాట్స్ రాము తాతయ్య గారు.. మీ మనవరాలు మిమ్మల్ని రూల్ చేసేంత గొప్పది కావాలని కోరుకుంటున్నాను. ఇంతకీ మీరు ఎలా పిలిపించుకోవడానికి ఇష్టపడతారు..? రాము తాతా, రాము నాన్నా, గ్రాండ్ పా రామునా..?' అంటూ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేలల్లో లైకులు, కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఆ కామెంట్స్ వర్మ గురించి మాత్రం కాదు. ఫ్యాన్స్ అంతా రాజమౌళిని 'RRR' అప్డేట్స్ గురించి అడుగుతున్నారు.
ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతుందనుకున్న సినిమా కాస్త 2021కి పోస్ట్ చేశారు. దీంతో అప్సెట్ అయిన ఫ్యాన్స్.. కనీసం తారక్, రామ్ చరణ్ లకి సంబంధించిన అప్డేట్స్ అయినా ఇవ్వండి అంటూ కోరుతున్నారు.