అక్కినేని నాగార్జున చిన్న, పెద్ద అని చూడకుండా టాలెంట్ ఉన్న దర్శకులకు అవకాశాలు ఇస్తుంటాడు. ఇది మంచి విషయమే.. అయితే దీంతో పాటు తను అనుకున్న రిజల్ట్ ఇవ్వని దర్శకులపై నేరుగానే కామెంట్స్ చేస్తుంటాడు నాగార్జున. తనే స్క్రిప్ట్ ఫైనల్ చేసి దర్శకుడు వీరభద్రం చౌదరి దర్శకత్వంలో 'భాయ్' సినిమా చేసిన నాగార్జున.. అది డిజాస్టర్ కావడంతో డైరెక్టర్ గురించి నెగెటివ్ గా మాట్లాడాడు.

అది ఆ దర్శకుడి కెరీర్ పై ప్రభావం చూపించింది. రీసెంట్ గా 'మన్మథుడు 2' సినిమా సమయంలో కూడా రాహుల్ రవీంద్రన్ ని కూడా స్క్రిప్ట్ పరంగా చాలా ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. రాహుల్ స్క్రిప్ట్ లో మార్పులు చేసి తనకు నచ్చినట్లుగా సినిమా తీయించాడు. ఇక 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా డైరెక్టర్ పరిస్థితి కూడా అలానే ఉంది.

వివాదంలో 'జార్జిరెడ్డి'.. రిలీజ్ అడ్డుకుంటామంటూ హెచ్చరికలు!

అతడితో 'బంగార్రాజు' సినిమా తీస్తానని ఆ తరువాత స్క్రిప్ట్ బాలేదని మీడియా ముఖంగానే చెబుతున్నాడు. నాగార్జున కారణంగా ఇబ్బంది పడిన దర్శకుల్లో శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నారు. అప్పటివరకు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు చేసిన శ్రీనివాసరెడ్డిని పిలిపించి 'ఢమరుకం' సినిమా ఛాన్స్ ఇచ్చాడు నాగార్జున. ఆ సినిమా ఫలితం ఏమైందో తెలిసిందే.

ఈ సినిమా చేస్తున్న సమయంలో డైరెక్టర్ పనితీరు నచ్చి 'హలో బ్రదర్' సీక్వెల్ చేద్దామని ప్రపోజల్ పెట్టాడు నాగ్. పది నెలల పాటు ఆ స్క్రిప్ట్ మీద పని చేసిన తరువాత వర్క్ ఆపించేశారు నాగార్జున. ఆ తరువాత నాగచైతన్యతో శ్రీనివాసరెడ్డికి 'దుర్గ' చేసే అవకాశమిచ్చాడు. కానీ అది కూడా తరువాత క్యాన్సిల్ చేసేసారు.

'ఢమరుకం' సినిమా తర్వాతతన కెరీర్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీనివాసరెడ్డి.. క్యాన్సిల్ అయిన ప్రాజెక్ట్ ల వలనే తన కెరీర్ ఇలా తయారైందంటూ పరోక్షంగా నాగార్జున మీద తన అసహనాన్ని చూపించాడు. కొన్నిసార్లు ఇలా అవుతుంటాయి.. ఏం చేయలేమంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇతడు డైరెక్ట్ చేసిన 'రాగల 24 గంటల్లో'సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.