చిత్ర పరిశ్రమలో  విషాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 2020వ సంవత్సరం అనేక చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులను పొట్టన బెట్టుకుంది. కాగా కన్నడ పరిశ్రమలో యువ హీరో చిరంజీవి సర్జా మరణాన్ని మరవక ముందే మరో మరణం సంభవించింది. ప్రముఖ దర్శకుడు షాహురాజ్ షిండే గుండె పోటుతో మరణించారు. నేటి ఉందయం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. 

నేటి ఉదయం షాహురాజ్ షిండే తన నివాసంలో కుప్పగూలిపోయారు. షాహురాజ్ షిండే మరణవార్త తెలుసుకున్న చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. షాహురాజ్ చాలా డిసిప్లైన్డ్ గా ఉంటారట. ఆరోగ్యం, ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొనే షాహురాజ్ షిండే, ప్రతిరోజు వ్యాయామం చేస్తారని ఆయన సన్నిహితులు చెవుతున్నారు. అలాంటి షాహురాజ్ షిండే గుండె పోటుతో మరణించారన్న విషయాన్ని సన్నిహితులు నమ్మలేకున్నారు. 

నటుడిగా కూడా కొన్ని సినిమాలలో నటించిన షాహురాజ్ షిండే 2007లో వచ్చిన స్నేహనా ప్రీతినా మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. అర్జున్, ప్రేమ చంద్రమా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. షాహురాజ్ అకాల మృతికి కన్నడ చిత్ర ప్రముఖులు ఆవేదనకు గురవుతున్నారు. వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.