సినిమా లాభాలు తెచ్చి పెడితే ఆ దర్శకుడు సినిమా ఆఫర్స్ మాత్రమే కాదు...నిర్మాతల నుంచి గిప్ట్ లు కూడా అందుతున్నాయి. కొందరు హీరోలు అయితే షూటింగ్ టైమ్ లోనే డైరక్టర్స్ ని సంతోష పెట్టేస్తున్నారు.
సినిమా లాభాలు తెచ్చి పెడితే ఆ దర్శకుడు సినిమా ఆఫర్స్ మాత్రమే కాదు...నిర్మాతల నుంచి గిప్ట్ లు కూడా అందుతున్నాయి. కొందరు హీరోలు అయితే షూటింగ్ టైమ్ లోనే డైరక్టర్స్ ని సంతోష పెట్టేస్తున్నారు. తాజాగా దర్శకుడు రమేష్ వర్మకు అలాంటి గిప్ట్ ఒకటి అందింది. ఆయన తాజాగా డైరక్ట్ చేసిన రాక్షసుడు చిత్రం హిట్ అవటం,లాభాలు తెచ్చిపెట్టడంతో రమేష్ వర్మకి నిర్మాత కోనేరు సత్యనారాయణ కాస్ట్‌లీ ఫ్లాట్‌ని బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. పెట్టిన పెట్టుబడికి రెండు రెట్లు లాభాలు రావటం జరిగింది. తమ బ్యానర్ లో గతంలో చేసిన సినిమాలు ఏవీ మినిమం రెవిన్యూ కూడా తెచ్చిపెట్టలేదు. దాంతో ఆ నిర్మాత చాలా ఖుషీగా ఉన్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఏ స్టూడియోస్, ఎ హవీష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రముఖ విద్యావేత్త కొనేరు సత్యనారాయణ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘రాక్షసుడు’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగాఆగస్ట్ 2న విడుదల చేశారు. సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా సూపర్ హిట్ టాక్‌తో సక్సెస్‌పుల్‌గా రన్ అయ్యింది. సినిమాలో లాస్ట్ ఫ్రేమ్ వరకూ ఎక్కడా టెంపో మిస్ అవకుండా రమేష్ వర్మ చాలా జాగ్రతగా తెరకెక్కించారు.
ఈ చిత్రం రిలీజైన 10వ రోజుకే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ సేఫ్ అయ్యారు. ఫస్ట్ వీక్‌లో నాలుగో రోజు కాస్త సినిమా డల్ అవగానే నిర్మాత భయపడ్డారు. అయితే సెకండ్ వీక్‌లో సినిమా అద్భుతంగా ఉందనే టాక్ మొదలైంది. దాంతో సెకండ్ వీక్‌లో సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. సాయి, అనుపమ ఇతర టెక్నీషియన్స్ బాగా ఇన్ వాల్వ్ అయ్యి చేశారు.
తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేసినా మన సెన్సిబిలిటీస్ ప్రకారం సినిమాను చేయటం కలిసొచ్చింది. ఓ హిట్ సినిమాను రీమేక్ చేయడం చాలా కష్టం. ఆ ఫీట్ ని సక్సెస్ ఫుల్ గా చేసారు రమేష్ వర్మ. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సైతం చాలా అండర్ ప్లే చేస్తూ క్యారెక్టర్ ని నిలబెట్టారు.
