సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా మంది నిజ జీవితాల ఆధారంగా సినిమాలు తీస్తుంటాడు. ప్రస్తుతం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా తీశాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ సెన్సార్ సమస్య కారణంగా ఇంకా విడుదలకు నోచుకోలేదు.

వివాదాస్పద సినిమాలు, కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలిచే వర్మ బయోపిక్ ఇప్పుడు రాబోతుందని సమాచారం. రచయిత, కవి జొన్నవిత్తుల గాతంలో గతంలో ఆర్జీవీ బయోపిక్ తీస్తానని సవాల్ విసిరారు. ఇప్పుడు అన్నంతపనీ చేస్తున్నారు.

భార్యని కొట్టిన సీరియల్ నటుడు.. పోలీసుల అరెస్ట్!

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ప్రమోషన్స్ సమయంలో ఓ టీవీ షోలో ఆర్జీవీ, జొన్నవిత్తుల మధ్య చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆర్జీవీ తనతో మాట్లాడిన తీరు నచ్చని జొన్నవిత్తుల అతడిపై మండిపడ్డారు. తనకు వర్మ 'జొన్నవిత్తుల చౌదరి' అని బిరుదు ఇచ్చాడని.. వర్మకి 'పప్పు వర్మ' అనే బిరుదు ఇస్తున్నట్లు చెప్పారు జొన్నవిత్తుల.

రామ్ గోపాల్ వర్మ బరితెగించినవాడు, బతికున్న శవం లాంటి వాడు అంటూ తీవ్రస్థాయిలో తిట్టిపోశారు. రామ్ గోపాల్ వర్మ ఫిలాసఫీ పైన 'పప్పు వర్మ' అనే బయోపిక్ తీస్తానంటూ చెప్పుకొచ్చారు.  ఇప్పుడు దానికి తగ్గ సన్నాహాలు చేస్తున్నారు. ఆర్జీవీ క్యారెక్టర్ పోషించే నటుడిని కూడా ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

దాదాపు ఆర్జీవీ మాదిరిగానే వుండే వ్యక్తి ఒకరు మధ్యప్రదేశ్ లో వున్నట్లు తెలియడంతో అక్కడని వెళ్లి సదరు వ్యక్తిని కలిసి సినిమాకి ఒప్పించినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు.

ఆర్జీవీ మీద పీకలలోతు కోపం, కసి ఉన్న పలువురు వ్యక్తులు ఈ సినిమా విషయంలో తమ వంతు సాయం అందిస్తామని ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. వర్మ వ్యవహారాలు మొత్తం ఎండగట్టే విధంగా స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారట.

ఆర్జీవీకి సంబంధించిన చాలా విషయాలను ఈ బయోపిక్ లో చూపించబోతున్నారు. ఆయనలోని నెగెటివ్ యాంగిల్ ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా సినిమా ఉంటుందని టాక్. మరి ఈ బయోపిక్ షూటింగ్ పూర్తి చేసుకొని ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి!