దర్శకుడు ఓంకార్ తెరకెక్కించిన 'రాజుగారి గది 3' సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు తమన్నాని తీసుకున్నారు. సినిమా ఓపెనింగ్ కి కూడా తమన్నా వచ్చింది. కానీ ఆ తరువాత పరిస్థితులు మారిపోయాయి. తమన్నా స్థానంలో అవికా గౌర్ వచ్చి చేరింది. తమన్నా ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం వెనుక అసలు 
కారణం ఏంటనే విషయాన్ని తాజాగా ఓంకార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

తమన్నాను హీరోయిన్ గా తీసుకున్నప్పుడు ఆమెకి లైన్ మాత్రమే చెప్పామని.. సినిమా మొదలుకావడానికి కొద్దిరోజుల ముందే ఫుల్ నేరేషన్ ఇచ్చామని, దానికి ఆమె చాలా మార్పులు చెప్పారని ఓంకార్ అన్నాడు. తన పాత్రను మార్చమని, దానికి తగ్గట్లు కథ మార్చాలని అడిగారట. అప్పుడు అంత సమయం లేకపోవడంతో తమన్నాను వద్దనుకొని అవికా గౌర్ తో ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లామని చెప్పుకొచ్చారు.

నాన్న చనిపోయారు.. నాకంతా తమ్ముళ్లే.. ఓంకార్ ఎమోషనల్ స్పీచ్! (వీడియో)

అయితే అవికా ఎంటర్ అయిన తరువాత హీరోయిన్ పాత్రను మొత్తం మార్చేసి హీరో పాత్రను పెంచారట. సినిమా మొత్తం హీరో మీదే నడిపించారట. దాంతో తమన్నా కోసం అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ కథ అలానే ఉందని.. వీలయితే దాన్ని 'రాజు గారి గది 4'గా తీసే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చాడు ఓంకార్. తమన్నా ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం వలన మంచే జరిగిందని.. హీరో రోల్ కి ప్రాముఖ్యత పెరిగి.. సినిమాలో వినోదానికి స్కోప్ పెరిగిందని ఓంకార్ అన్నారు.

తమన్నాకి బదులుగా తాప్సీ, కాజల్ ఇలా చాలామందిని ప్రయత్నించామని, అయితే ఎవరి డేట్ లు అందుబాటులో లేకపోవడంతో అవికా గౌర్ ని తీసుకున్నామని అది కూడా సినిమాకు ప్లస్ అయిందని అన్నారు. సినిమా క్లైమాక్స్ మొత్తం అవికా చుట్టూనే తిరుగుతుంటుందని చెప్పారు.