కొన్ని రీమేక్ లు కొన్నప్పుడు ఉన్న ఉత్సాహం ఆ తర్వాత ఉండదు. రకరకాల కారణాలతో వాయిదాపడుతూ ఆగిపోతూంటాయి. మూడు కేటగిరీల్లో జాతీయ పురస్కారం అందుకున్న బాలీవుడ్‌ చిత్రం ‘అంధాధున్‌’.  ఆయుష్మాన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో చేయాలని హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రైట్స్ తీసుకున్నారు. అందులో హీరో చూడగలిగి కూడా గుడ్డివాడుగా నటించాలి! అదీ మన తెలుగు హీరోలుకు నచ్చక ఆగిపోయింది.

అందుకే సెట్స్ పైకి 'అంధాధున్' రీమేక్ వెళ్ళలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బయిట థ్రిల్లర్స్ కు మంచి ఆదరణ లభిస్తూండటంతో...ఈ సినిమాని రీమేక్ చేయటం ఈ సీజన్ లో కరెక్ట్ అని నితిన్ ఫీలయ్యారట. దాంతో వెంటనే పట్టాలు ఎక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా దర్శకుడుని సైతం ఫైనలైజ్ చేసినట్లు సమాచారం.

శ్రేష్ఠ్‌ మీడియా, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించబోతున్నాయట. ఇది ఇలా ఉంటే మరి చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరనే సందేహానికి మేర్లపాక గాంధీ పేరు వినబడుతోంది. ఇదే విషయమై నిర్మాతలు గాంధీను సంప్రదించారని, ప్రస్తుతం  స్క్రిప్టు వర్క్  సాగుతున్నాయని టాలీవుడ్‌ టాక్‌. త్వరలోనే వివరాలు తెలియనున్నాయి.

 గతంలో గాంధీ తెరకెక్కించిన వెంకటాద్రి ఎక్సప్రెస్, ఎక్సప్రెస్ రాజా ఎంతటి ఘన విజయం సాధించాయో తెలిసిన విషయమే. ఫన్, టెన్షన్ ఎలిమెంట్స్ కలగలిపిన కథలు తీయగలడనే ముద్ర ఆయనపై ఉంది.  దాంతో అతను అయితేనే ఈ చిత్రానికి న్యాయం చేయగలడంటూ అందుకే ఆ ప్రాజెక్టు గాంధీ దగ్గరకు వెళ్లిందనే వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే కృష్ణార్జున యుద్దం డిజాస్టర్ తర్వాత ఆయన వెనకబడిపోయారు. అయితే ఈ రీమేక్ తో మళ్లీ ఫామ్ లోకి వస్తాననే ఆశతో ఉన్నారు. ఇప్పటికే తెలుగు కోసం మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు నుంచి ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాసం ఉందని సమాచారం.

ఇక నితిన్ కెరీర్ సైతం ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ఛల్ మోహన్ రంగా, లై, శ్రీనివాస కళ్యాణంతో  హాట్రిక్ డిజాస్టర్స్ వచ్చాయి. వచ్చే వారం రిలీజ్ కాబోయే భీష్మపైనే ఆశలు అన్ని పెట్టుకున్నాడు. అలాగే ఈ చిత్రం తర్వాత ఏలేటి తో చేస్తున్న చిత్రం, రంగ్ దే అనే చిత్రం లైన్ లో ఉన్నాయి.