పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారని చాలా రోజులుగా ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. 'పింక్' రీమేక్ సినిమాలో నటించబోతున్నారని, దిల్ రాజు-బోనీ కపూర్ సంయుక్తంగా సినిమాను నిర్మించబోతున్నారని వార్తలు వినిపించాయి. మరోపక్క క్రిష్ కూడా పవన్ తో సినిమా చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఓ జానపద కథతో పవన్ తో సినిమా తీసి సక్సెస్ కొట్టాలని భావిస్తున్నాడు. ఏఎం రత్నం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాలని చూస్తున్నారు. అయితే పవన్ ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు కానీ ఓ పక్క దిల్ రాజు, మరో పక్క క్రిష్ లు ముందు మా సినిమా అంటే కాదు మా సినిమా అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం..  పవన్ మాత్రం 'పింక్' రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. తక్కువ రోజుల సమయంలో షూటింగ్ పూర్తి చేయొచ్చు కాబట్టి ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి దిల్ రాజు ఆస్థానంలో ఉన్న దర్శకుడు వేణుశ్రీరామ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తారని అనుకున్నారు కానీ ఇప్పుడు తెరపైకి మరో పేరు వచ్చింది.

డైరెక్టర్ విషయంలో పవన్ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయని తెలుస్తోంది. 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయకి పవన్ నుండి పిలుపు వచ్చినట్లు సమాచారం.

ప్రస్తుతం అతడు స్క్రిప్ట్ మీద పని చేస్తున్నారు. డిసంబర్ నెలలో సినిమాను మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రాధమిక చర్చలు పూర్తయినట్లు బోగట్టా. అధికారికంగా అతి కొద్దిరోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.