టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క నెక్స్ట్ నిశ్శబ్దం సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. సూపర్ సినిమాతో పరిచయమైన అనుష్క ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్ళవుతుంది. అందుకే నిశ్శబ్దం చిత్ర యూనిట్ స్వీటి కి ఒక ఈవెంట్ తో మంచి గిఫ్ట్ ఇచ్చింది. ఇక వేడుకలో అనుష్కతో వర్క్ చేసిన సినీ ప్రముఖులు అనుష్క గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు.

సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్ర రావ్ కూడా అనుష్క గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. "అనుష్కను మొదటిసారి నాగార్జున గెస్ట్ హౌజ్ లో చూశాను. శ్రీరామ దాసు షూటింగ్ జరుగుతునపుడు ఒకసారి కలవడానికి వెళితే.. మీకొక మంచి హీరోయిన్ ని చూపిస్తాను అని నాగ్ చెబుతూ అనుష్కను పిలవగానే.. మెట్ల మీద నుంచి సూపర్ హీరోయిన్  దిగింది. ఆమె కళ్ళు చూడగానే చెప్పేశా.. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ నువ్వే అని.

ఆ తరువాత అరుంధతి - బాహుబలి - భాగమతి అంటూ అనుష్క మంచి సక్సెస్ లు అందుకుంది. 'ఓ నమో వెంకటేశాయ' సినిమా ద్వారా ఆమెతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. సాదారణంగా అందరూ సినిమాల్లో అవకాశాల కోసమా ట్రై చేస్తుంటారు. కానీ అనుష్కను మాత్రం సినిమాలే వెతుక్కుంటూ వచ్చాయి. ఆమె మరిన్ని విజయాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా. నిశ్శబ్దం కూడా మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది" అంటూ రాఘవేంద్రరావు వివరించారు.