Asianet News TeluguAsianet News Telugu

మెగా, నందమూరి, ఘట్టమనేని అభిమానులకు నచ్చే ఒకే ఒక్క హీరో

వెంకటేష్ గారు అంటే ప్రతి అభిమానికి చాలా ఇష్టం. ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా అందుకొని హీరో వెంకటేష్ గారు ఒక్కరే అని ఆయనంటే మెగా నందమూరి మహేష్ అభిమానులు సమానంగా ఇష్టపడతారని దర్శకుడు బాబీ వెంకీ మామ వేడుకలో మాట్లాడారు. 

director bobby speect at venky mama pree release event
Author
Hyderabad, First Published Dec 7, 2019, 8:51 PM IST

వెంకటేష్ గారు అంటే ప్రతి అభిమానికి చాలా ఇష్టం. ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా అందుకొని హీరో వెంకటేష్ గారు ఒక్కరే అని ఆయనంటే మెగా నందమూరి మహేష్ అభిమానులు సమానంగా ఇష్టపడతారని దర్శకుడు బాబీ వెంకీ మామ వేడుకలో మాట్లాడారు. ఖమ్మం లో వెంకీ మామ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చిత్ర యూనిట్ సభ్యులుగ్రాండ్ గా నిర్వహించారు. 

గతంలో ఎప్పుడు లేని విధంగా వెంకటేష్ - నాగచైతన్య కలిసి నటిస్తున్న బిగ్ మల్టీస్టారర్ కావడంతో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే వేడుకలో చిత్ర దర్శకుడు కెఎస్.రవీంద్ర (బాబీ) తన మాటలతో ఆకట్టుకున్నారు. చిన్నప్పుడు వెంకటేష్ సినిమా చూడటానికి అందరి ఇంట్లో ఆడవాళ్లు ఎంత ఆసక్తి చూపేవారో నాకు తెలుసు. ఒక విసిఆర్ క్యాసెట్ తేవడానికి షాపుకి వెళితే ఒక్క క్యాసెట్ దొరికేది కాదు. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి హీరో అభిమాని వెంకటేష్ గారిని ఇష్టపడతారు. మహేష్ పవన్ కళ్యాణ్ వరుణ్ తేజ్ వంటి హీరోలతో నటించిన ఆయన ఇప్పటికి కూడా అదే రిలేషన్ తో ఉన్నారు అంటే ఆయన ఎలాంటి వారో అర్ధం చేసుకోవచ్చని నాగ చైతన్య కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించాడని బాబీ మాట్లాడారు. సినిమా మామ అల్లుళ్ళ కు కెరీర్ లో ఒక స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అన్నారు. 

-----

also read: వెంకీ మామ ట్రైలర్.. మామ అల్లుళ్ళ మోత మాములుగా లేదు 

దగ్గుబాటి వెంకటేష్ - అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఫుల్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ వెంకీ మామ. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఎట్టకేలకు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చి పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసింది. ఇక నేడు గ్రాండ్ గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు.

 ఇప్పటికే టీజర్ అండ్ సాంగ్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతుండగా ఇప్పుడు వెంకిమామ ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఇక సినిమా లో మామ అల్లుళ్ళు మోత మోగించారని అనిపిస్తోంది. డైలాగ్స్ ఎమోషన్స్ అండ్ కామెడీ ఇలా అన్ని నవసరసాలు సినిమాలో ఉన్నట్లు అర్ధమవుతోంది. దర్శకుడు బాబీ చైతు - వెంకీ ల మధ్య క్రియేట్ చేసిన సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా కనెక్ట్ కానున్నట్లు క్లారిటీ వచ్చేసింది.

మరోవైపు పాయల్ రాజ్ పుత్ - రాశి ఖన్నా గ్లామర్ కూడా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ కా నిలవనుంది. మొత్తానికి ట్రైలర్ తో ఆకట్టుకున్న మామ అల్లుళ్ళు బిగ్ స్క్రీన్ పై ఏ లెవెల్లో మోత మోగిస్తారో తెలియాలంటే డిసెంబర్ 13వరకు వెయిట్ చేయాల్సిందే. సురేష్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు తమన్స్ మ్యూజిక్ అందించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios