కన్నడ బ్యూటీ రష్మిక 'ఛలో' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత 'గీత గోవిందం' సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ఈ బ్యూటీకి మహేష్ బాబుతో కలిసి నటించే ఛాన్స్ దక్కింది. అనీల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు'లో రష్మిక హీరోయిన్ గా నటించింది.

అయితే మహేష్ పక్కన రష్మిక హీరోయిన్ అనగానే చాలా మంది ఈ సెలక్షన్ పై పెదవి విరిచారు. చాలా విమర్శలు చేశారు. సూపర్ స్టార్ పక్కన రష్మిక సెట్ కాదని.. ఆమెకి అంత రేంజ్ లేదని ఇలానే చాలానే కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై తాజాగా స్పందించాడు దర్శకుడు అనీల్ రావిపూడి.

డబ్బు కోసం వేధిస్తున్నాడు.. స్టార్ కమెడియన్ పై ఆరోపణలు!

మహేష్ పక్కన రష్మిక వద్దని తనకు కూడా చాలా మంది చెప్పారని.. పర్సనల్ గా ఫోన్లు కూడా చేశారని గుర్తు చేసుకున్నాడు అనీల్ రావిపూడి. మహేష్ పక్కన ఈ అమ్మాయేంటి అని అందరూ అన్నారని.. కానీ ట్రైలర్ చూసిన తరువాత రష్మికని ఎందుకు తీసుకున్నానో.. చాలా మందికి అర్ధమైందని అన్నారు అనీల్ రావిపూడి.

నిజానికి తన కథకు పెద్ద హీరోయిన్ అవసరం లేదని అంటున్నాడు. పెద్ద హీరోయిన్ తో సెట్స్ పైకి వెళ్తే అది పెద్ద మిస్టేక్ అయి ఉండేదని.. ఆ తప్పు తను చేయలేదని చెప్పుకొచ్చాడు. తన సినిమాకి స్టార్ హీరోయిన్ వద్దని.. ఓ క్యారెక్టర్ కావాలని.. రష్మిక మంచి ఆర్టిస్ట్ అని చెప్పారు.

ట్రైన్ లో కర్నూలు వెళ్లే ఓ సాదాసీదా అమ్మాయి కావాలని.. రష్మికని తీసుకోవడం మంచి నిర్ణయమని మహేష్ కూడా అన్నారని అనీల్ రావిపూడి వెల్లడించాడు. ఈ సినిమాతో రష్మిక కెరీర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని చెప్పుకొచ్చారు.