సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సందడి చేయబోతున్నాడు. మహర్షి చిత్రంతో ఘనవిజయం సొంతం చేసుకున్న మహేష్.. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మరో భారీ హిట్ పై కన్నేశాడు. రష్మిక మందన తొలిసారి మహేష్ జోడిగా నటిస్తున్న చిత్రం ఇది. 

మహేష్ బాబు ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ గా నటిస్తుండడం ఆసక్తిని రేపుతోంది. అనిల్ రావిపూడి ఈ చిత్రం మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చి దిద్దుతున్నాడు. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలకు సిద్ధం అవుతోంది. 

సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి నేడు చిత్ర యూనిట్ ఆసక్తికర ప్రకటన చేసింది. మెగా ఘట్టమనేని ఫ్యాన్స్ పండగ చేసుకునేలా మెగాస్టార్ చిరంజీవి సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లు ప్రకటించారు. 

తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు చిత్ర నిర్మాతలు దిల్ రాజు, అనిల్ సుంకర మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరవుతున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సూపర్ స్టార్ మహేష్ కూడా సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ కు థాంక్స్ చెప్పాడు. 

చిరంజీవి గారు సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కానుండడంతో తమ సంతోషం రెట్టింపైంది అని తెలిపాడు. మా సెలెబ్రేషన్స్ లో భాగం కాబోతున్నందుకు థాంక్యూ సర్ అని మహేష్ ట్వీట్ చేయడం విశేషం. 

హెబ్బా పటేల్ సెక్సీ ఫోజులు.. సెగలు రేపేలా ఫొటోస్

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుక జనవరి 5న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది. తమ చిత్రాల ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేష్, చిరంజీవి తొలిసారి ఒకేవేదికపై కనిపించబోతున్నారు.