నిర్మాత దిల్ నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. అత్యధిక విజయాలు ఉన్న నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. దిల్ రాజు నిర్మాతగా దూసుకుపోతున్న సమయంలో ఆయన ఫ్యామిలిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. 2017లో దిల్ రాజు సతీమణి అనిత గారు అనారోగ్య కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. 

అప్పటి నుంచి దిల్ రాజు రెండో వివాహంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల దిల్ రాజు రెండో పెళ్ళికి సిద్ధం అవుతున్నారని ప్రచారం ఎక్కువైంది. ఆ ఉహాగానాలే నేడు నిజమయ్యాయి. తాను రెండవ వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించబోతున్నట్లు దిల్ రాజు అధికారికంగా ఓ ప్రకటనవిధుల\ విడుదల చేశారు. 

అందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో సమస్యలు వస్తుంటాయి.. పోతుంటాయి. నా జీవితంలో కూడా వ్యక్తిగత సమస్యలు దూరమవుతాయని భావిస్తున్నాను. అందుకు అనుగుణంగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాయి అంటూ దిల్ రాజు ప్రకటించారు. 

అందుతున్న మరింత సమాచారం ప్రకారం.. ఇవాళ రాత్రి 11 గంటలకు(ఆదివారం) దిల్ రాజు రెండో పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దిల్ రాజు వయసు 49 ఏళ్ళు. దిల్ రాజుని పెళ్లి చేసుకోబోయే వధువు ఎవరనేది ఇప్పటికైతే సస్పెన్స్. 

నిజామాబాద్ జిల్లాలో దిల్ రాజు కుటుంబ సభ్యులు కట్టించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే దిల్ రాజు వివాహం జరగనుంది.