Asianet News TeluguAsianet News Telugu

“అఖండ” క్రేజ్ పీక్స్: ట్రేడ్ కు షాకిచ్చే రేటుకు 'నైజాం రైట్స్' దిల్ రాజుకే !

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. ఇదే సమయంలో ఈ సినిమా బిజినెస్ కూడా దాదాపు పూర్తైననట్లు తెలుస్తోంది. ఎక్సపెక్టేషన్స్ కు  తగ్గట్టే ఓ రేంజిలో బిజినెస్ ని కూడా జరుపుకుంటోంది.

Dil Raju to distribute Balakrishna's 'Akhanda' in Nizam
Author
Hyderabad, First Published Oct 17, 2021, 3:37 PM IST

బాలకృష్ణ  హీరోగా తెరకెక్కుతున్న ‘అఖండ’ శరవేగంగా ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. దీపావళికి సందడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని వార్తలు వచ్చినా క్లారిటీ లేదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. ఇదే సమయంలో ఈ సినిమా బిజినెస్ కూడా దాదాపు పూర్తైననట్లు తెలుస్తోంది. ఎక్సపెక్టేషన్స్ కు  తగ్గట్టే ఓ రేంజిలో బిజినెస్ ని కూడా జరుపుకుంటోంది.

 నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. ఈ కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ హిట్స్ సాధించడంతో అఖండ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.  దాంతో ఏరియాల వారిగానే భారీ మొత్తంలో ధర పలుకుతున్నాయి.  ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోతున్నాయట. అంతేకాదు ఈ అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్స్ టచ్ చెయ్యనున్నట్టుగా తెలుస్తోంది. 

 ఈ చిత్రం నైజాం హక్కులు కూడా భారీగానే అమ్మినట్లు తెలుస్తోంది. నైజాం రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏకంగా 19కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా మొత్తం ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్ల కు అమ్ముడయ్యాయంటున్నారు, సీడెడ్ రీజియన్ హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయాయని చెప్తున్నారు. మరో ప్రక్క ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది.  
 
ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రల్లో సందడి చేస్తారు. ప్రగ్యా జైశ్వాల్‌, పూర్ణ హీరోయిన్స్. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ - గోపీచంద్‌ మలినేని కలయికలో ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. ఆ తర్వాత బాలకృష్ణ చేయనున్న చిత్రం ఖరారైన విషయం తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios