ప్రభాస్ తో అవకాశం వస్తే ఒక మంచి కమర్షియల్ సినిమా చేయాలనీ ఏ ప్రొడ్యూసర్ కి ఉండదు. ఇప్పుడు చాలా మంది బహుబాలినే కలవరిస్తున్నారు. దర్శకులు కూడా సింగిల్ సిట్టింగ్ లో కథను ఒప్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే డార్లింగ్ మాత్రం సాహో అనంతరం ఎవరికీ అంత త్వరగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.

సీనియర్ నిర్మాతలు కూడా ప్రభాస్ డేట్స్ ఇస్తే బావుండని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. టాలీవుడ్ సీనియర్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు కూడా మిస్టర్ పర్ఫెక్ట్ డేట్స్ ఇస్తే సినిమా చేయాలని రెడీగా ఉన్నాడు. సాహో అనుకున్నంతగా విజయాన్ని అందుకోకపోవడంతో కాస్త డీలాపడ్డ ప్రభాస్ కథలను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.

గత కొన్ని రోజులుగా ప్రభాస్ తో సైరా దర్శకుడు యాక్షన్ మూవీ చేయబోతున్నట్లు టాక్ వచ్చింది. సురేందర్ రెడ్డి - మహేష్ కాంబినేషన్ పై కూడా రూమర్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా దిల్ రాజు ప్రభాస్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ నిసెట్స్ పైకి తీసుకురాబోతున్నట్లు టాక్ వస్తోంది. ఇప్పటికే డార్లింగ్ కోసం మంచి కథలు ఉంచిన దిల్ రాజు డేట్స్ ఇస్తే తనకు ఇష్టమైన కథను తెరపైకి తేవాలని దిల్ రాజు సిద్ధంగా ఉన్నారు.  

ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ అయిపోయేలోగా మరో సినిమాను సెట్స్ పైకి తేవాలని ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.