నాగార్జున హీరోగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరక్షన్ లో రూపొంది సెన్సేషనల్ హిట్ అయిన సినిమా 'గీతాంజలి'. పెయిన్ ఫుల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాని చాలా కాలం తర్వాత మళ్ళీ గుర్తు చేసింది 'ఇద్దరి లోకం ఒక్కటే' చిత్రం ట్రైలర్‌.  ట్రైలర్ చివ‌ర‌లో ‘గీతాంజలి’ సినిమాలోని ఓం నమహా పాటలో నాగార్జున, గిరిజ ముద్దు పెట్టుకున్న సీన్‌ను రాజ్ తరుణ్, షాలినీ చూస్తూ ఓ ఫీల్ లోకి వెల్తారు. ఈ షాట్ చూసిన చాలా ఇంట్ర‌స్టింగ్‌గా అనిపించింటమే కాక చర్చకు దారి తీసింది. గీతాంజలికి ఈ సినిమాకు సంభందం ఏమిటి అని సోషల్ మీడియాలో సినిమా లవర్స్ మధ్య హాట్ టాపిక్ నడుస్తోంది.

అంటే ఈ సినిమా కూడా  ‘గీతాంజలి’ సినిమా తరహాలో ఫీల్ గుడ్ పెయిన్ ఫుల్ లవ్ స్టోరిగా నడవబోతోందా...లేక వేరే కారణం ఏదైనా ఉందా...అనేది తెలియటం లేదు. అదేం కాదు సినిమా చివర్లో సాడ్ ఎండింగ్ ఉంటుంది, అందుకే గీతాంజలిని గుర్తు చేసారు అని కొందరు గెస్ చేస్తూంటే..మరికొంత మంది..గీతాంజలి లాంటి క్లాసిక్ ని మేము తీసాం అని చెప్పడానికి దిల్ రాజు ఈ పని చేసాడని కొందరంటున్నారు. ఏదైతేనేం సినిమా రిలీజ్ కు ముందు కొద్దిగా బజ్ క్రియేట్ చేయగలిగుతోంది ఈ ట్రైలర్. మరో ప్రక్క చాలా మంది ఈ చిత్రం కెమెరా వర్క్ ని మెచ్చుకుంటున్నారు. విజువల్స్ ఓ రేంజిలో ఉన్నాయని, సైలెంట్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ దర్శకుడు ఎవరు..ఇంతకు ముందు ఎవరు దగ్గర పనిచేసాడు వంటి వివరాలు లాగటానికి ప్రయత్నం చేస్తున్నారు.

టైమ్ దొరికితే చాలు..ఈ స్టార్లు.. అక్కడ వాలిపోతారు!

ఇక ఈ చిత్రంపై  మొదట్నుంచీ ఈ సినిమాపై రాజ్‌తరుణ్‌ చాలా నమ్మకంగా ఉన్నాడు. తనకు సెంటిమెంట్‌ అయిన డిశంబర్‌ 25న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నాడు. ఖచ్చితంగా అందరికీ నచ్చే చిత్రమవుతుందని, ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న హిట్‌ తన సొంతమవుతుందని రాజ్‌ తరుణ్‌ భావిస్తున్నాడు.
 
 ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి షాలిని పాండే హీరోయిన్ గా న‌టిస్తుంది. జి.ఆర్‌.కృష్ణ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ పతాకంపై శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి స‌మీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. అబ్బూరి రవి మాటలు సమకూర్చుతున్నారు. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.