యువ హీరో రాజ్ తరుణ్ ఈమధ్యన అసలు ఫామ్ లో లేరు. వరస పెట్టి సినిమాలు ప్లాఫ్ కావటంతో కెరీర్లో స్లో అయ్యిపోయింది.ఎన్నో ఆంచనాలు పెట్టుకుని దిల్ రాజు బ్యానర్ లో చేసిన 'లవర్' సైతం దెబ్బకొట్టీాడు. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ దిల్ రాజు బ్యానర్ లోనే ఓ సినిమా చేస్తున్నాడు.  ఈ సారి ప్యూర్ లవ్ స్టోరీ.  'ఇద్దరి లోకం ఒకటే' అనే టైటిల్ తో తెరకెక్కునున్న ఈ చిత్రంటీమ్..ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. లవ్ స్టోరీ అని చెప్తూ ..హీరో, హీరోయిన్స్ ఫేస్ లు లేకుండా ఈ లుక్ రిలీజై, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.   'లోకం' పదానికి చుట్టూ వైట్ కలర్ హార్ట్ సింబల్ ఉంది.  ఇక ఈ సినిమా క్యాప్షన్ 'యూ ఆర్ మై హార్ట్ బీట్'.

జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ ‘ఇద్దరి లోకం ఒకటే’ షూటింగ్ దాదాపు పూర్తైనట్లు సమాచారం.  మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. నవంబర్ 8న ఈ సినిమా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారని వినికిడి.

‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘రాజ్‌తరుణ్‌తో మా బ్యానర్‌లో చేస్తోన్న రెండో చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంతో జి.ఆర్‌. కృష్ణని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. మిక్కీ జె.మేయర్‌ సంగీతం, సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ, అబ్బూరి రవి మాటలు సమకూర్చుతున్నారు. ’’ అన్నారు.

కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో హై క్వాలిటీతో ఈ సినిమా రూపొందుతోందని, నాన్ థియోట్రకల్ రైట్స్ తోనే ఈ ఇన్విస్టిమెంట్ రికవరీ అవుతుందని చెప్తున్నారు.  ఈ సినిమాని ఆయనే స్వయంగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, ఇక వచ్చేదంటా లాభమే అంటిన్నారు. దిల్ రాజు సైతం ఈ సినిమాపై మంచి నమ్మకం పెట్టుకుని, తరుచుగా పర్యవేక్షిస్తున్నారు. బొమ్మరిల్లు స్దాయి హిట్ మళ్లీ తన బ్యానర్ లో రాబోతోందని అంటున్నట్లు సమాచారం. మొత్తానికి మరో టాలెంట్ ఉన్న యువ దర్శకుడుని ఇండస్ట్రీకు దిల్ రాజు అందించబోతున్నారన్నమాట.