గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో బడా నిర్మాతగా కొనసాగుతున్న నిర్మాత దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో సక్సెస్ లను అందుకున్నారు. టాలెంట్ ఉన్న దర్శకులను వెతికి పట్టుకొని మంచి కథలను జడ్జ్ చేయగల రాజు అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఇష్టమే.

ఇప్పుడున్న స్టార్ దర్శకుల్లో చాలా మంది దిల్ రాజు స్కూల్ నుంచి వచ్చినవారే.  బాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా ఎలాంటి స్టార్స్ అయినా టాలీవుడ్ లో ఏదైనా పని పడితే ముందు దిల్ రాజునే కలుసుకుంటారు. మోడీ కూడా ఇన్వైట్ చేశారంటే రాజుగారి రేంజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చ. అసలు మ్యాటర్ లోకి వెళితే.. దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఒక యువకుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ గత కొంత కాలంగా నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు.  అసలైతే గతంలోనే సతీష్ అనే కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన దిల్ రాజు ఆశిష్ ను హిరోఘా పెట్టి సినిమాని నిర్మించాలని అనుకున్నారు. కానీ ఎందుకో ఆ స్టోరీ పట్టాలెక్కలేదు. ఇక ఇప్పుడు హుషారు డైరెక్టర్ శ్రీ హర్ష చెప్పిన ఒక కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దిల్ రాజు ఆశిష్ కి ఆ స్క్రిప్ట్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక సినిమా టైటిల్ ని రౌడీ బాయ్స్ అని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది.