సినిమా ప్రమోషన్ నిమిత్తం ఎంత ఖర్చుపెట్టినా బజ్ క్రియేట్ కాకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరనేది టీమ్ ఫీలింగ్ అని తెలుస్తోంది. అప్పటికీ ఎలాగైనా నాగచైతన్య కు హిట్ ఇవ్వాలని, రెగ్యులర్ సినిమా ప్రమోషన్  బడ్జెట్ ని మించే ఈ సినిమాకు ఖర్చు పెట్టినా ఫలితం కనపడటం లేదు. 


సోషల్ మీడియాలో దిల్ రాజు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు అక్కినేని ఫ్యాన్స్ కు. తమ హీరో చిత్రం ధాంక్యూ రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్నా ఎక్కడా బజ్ వినపడకపోవటం వాళ్లని కంగారుపడుతోంది. దాంతో వాళ్లు నిర్మాత దిల్ రాజు ని ట్యాగ్ చేస్తూ ..రిక్వెస్ట్ లు చేస్తున్నారు. డిమాండ్ లు పెడుతున్నారు. మీరు చేస్తున్న ప్రమోషన్స్ సరిపోవటం లేదని చెప్తున్నారు. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన పాటలు కు పెద్దగా రెస్పాన్స్ రాలేదని గుర్తు చేస్తున్నారు. కాలేజీ ఫెస్టివల్ ఈవెంట్స్ కు, ఇంటర్వూకు వెళ్లినా ఉపయోగం కనపడటం లేదని, అవన్నీ పాతకాలం పబ్లిసిటి స్ట్రాటజీలు అని అంటున్నారు. ఏదో ఒకటి కొత్తగా చేయమని ,వాటితో తమ హీరో చిత్రానికి ఓపినింగ్స్ అదిరిపోవాలని చెప్తున్నారు.

మరో ప్రక్క సినిమా ప్రమోషన్ నిమిత్తం ఎంత ఖర్చుపెట్టినా బజ్ క్రియేట్ కాకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరనేది టీమ్ ఫీలింగ్ అని తెలుస్తోంది. అప్పటికీ ఎలాగైనా నాగచైతన్య కు హిట్ ఇవ్వాలని, రెగ్యులర్ సినిమా ప్రమోషన్ బడ్జెట్ ని మించే ఈ సినిమాకు ఖర్చు పెట్టినా ఫలితం కనపడటం లేదు. విక్రమ్ కుమార్, నాగచైతన్య, దిల్ రాజు కాంబో అనగానే ఎంతలా జనం ఎదురుచూడాలి. కానీ అదేమీ జరగటం లేదు. అదేదిల్ రాజుని కంగారుపెడుతున్నట్లు సమాచారం. సినిమా రిలీజ్ మరో రెండు వారాలే ఉంది. అప్పటికీ ప్రతీ రోజు వార్తల్లో ఉండేలా ఏదో ఒక ఇంటర్వూ , యూట్యూబ్ హంగామానో చేస్తున్నా పట్టించుకునేవాళ్లు కరువు అయ్యారు.

అక్కినేని నాగచైత‌న్య హీరోగా శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం థాంక్యూ. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రానికి బి.వి.ఎస్‌.ర‌వి క‌థ‌, మాట‌ల‌ను అందించారు. రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్స్‌గా న‌టించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. చైతూ మహేశ్ బాబు ఫ్యాన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇంటెన్స్ థ్రిల్లర్ గా రూపొందొంది.

 నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ...ఇప్ప‌టి వ‌రకు నాగ‌చైత‌న్య చేయన‌టువంటి ఓ వైవిధ్య‌మైన పాత్ర‌ను ఈ సినిమాలో చేస్తున్నారు. యాక్ట‌ర్‌గా ఆయ‌నలోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించే చిత్ర‌మిద‌ని క‌చ్చితంగా, న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌ల‌ను. బి.వి.ఎస్‌.ర‌వి అందించిన అద్భ‌తుమైన క‌థ‌ను డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కె.కుమార్‌గారు మ‌రింత గొప్ప‌గా సినిమాగా మ‌లిచారు మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్, ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్ , ఎడిట‌ర్ న‌వీన్ నూలి .. ఇలా ఓ బెస్ట్ సినిమాను అందించ‌డానికి బెస్ట్ టీమ్ వ‌ర్క్ చేసింది అన్నారు.