పవర్ స్టార్ అభిమానులు పవన్ నెక్స్ట్ సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలీవుడ్  పింక్ రీమేక్ తో రాబోతున్నట్లు న్యూస్ వచ్చినప్పటికీ ప్రతి రోజు ఎదో ఒక టాక్ ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. పవన్ పింక్ రీమేక్ లో నటించడం చాలా మందికి ఇష్టం లేకపోయినప్పటికీ అందరికి నచ్చేలా సినిమాను తెరకెక్కించాలని పవన్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

అయితే సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 30రోజుల కాల్షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయాలకు ఏ మాత్రం దూరంగా ఉండకూడదని నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ షూటింగ్ ని అనుకున్న సమయంలో పూర్తి చేయాలనీ అనుకుంటున్నాడు. అందుకే చిత్ర యూనిట్ కూడా పవన్ కి అనుకువుగా ఉండే విధంగా ఒకటే స్టూడియోలో సెట్స్ వేసి సినిమాని పూర్తి చేయాలనీ పక్కాగా ప్లాన్ చేసుకున్నారు.

ఇక పవన్ ట్రావెలింగ్ విషయంలో ఇబ్బందులు ఉండకూదని నిర్మాత దిల్ రాజు ఒక ప్రత్యేక మినీ విమానాన్ని ఏర్పాటు చేశారట.  ప్రతిరోజు హైదరాబద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి ట్రావెల్ చేయాలంటే చాలా సమయం వృధా అవుతోంది. అందుకే పవన్ కి అనుకూలంగా ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని చార్టెడ్ ఫ్లైట్ ని రెడీ చేసినట్లు సమాచారం. మరీ పవన్ అనుకున్న సమయంలో షూటింగ్ ని పూర్తి చేస్తాడో లేదో చూడాలి.  రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.