పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్నారు. ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందుకు తగినట్లుగానే కంటిన్యూ షెడ్యూల్స్ తో సినిమాని స్పీడుగా లాగేసారు. కేవలం లాస్ట్ షెడ్యూల్ మాత్రమే పెండింగ్ ఉంది. అందుతున్న సమాచారం మేరకు అది వకీల్ సాబ్ కు ఉన్న ప్లాష్ బ్యాక్ స్టోరీ. అందులోనే హీరోయిన్ కనపడుతుంది. ఠాగూర్ లో చిరుకు,జ్యోతికకు ఉన్న ప్లాష్ బ్యాక్ లాంటిది ప్లాన్ చేసారట. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తో వకీల్ సాబ్ ..పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గా మిగిలిపోతాడట. అంతేకాదు అతని యాటిట్యూడ్ లో సైతం మార్పు వస్తుంది.  అయితే ఇవి ఒరిజనల్ వెర్షన్ లో లేవు. 

పవన్ కళ్యాణ్ సినిమా అనగానే అభిమానులు ఆశించే ఎలిమెంట్స్ ఉండాలని పెట్టిన సీన్స్ ఇవి. ఇప్పుడా ఎపిసోడ్ మాత్రమే పెండింగ్ ఉండటంతో ...అసలు దాన్ని తీసేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన దిల్ రాజుకు కలిగింది. దర్శకుడు వేణు శ్రీరామ్ తో చర్చించి, పవన్ ని సంప్రదించారట. దానికి పవన్ సైతం ఓకే అన్నారట. ప్లాష్ బ్యాక్ ఏంగిల్ లేకపోయినా సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది కాబట్టి వర్కవుట్ అవుతుందని పవన్ చెప్పారట. దాంతో ఇప్పుడు ఆ ఎపిసోడ్ లేకుండానే ముందుకు వెళ్దామని ఫిక్సయ్యారట. దాంతో సినిమాలో హీరోయిన్ లేకుండా పోతుందని అంటున్నారు. దాంతో ఒక్కసారి లాక్ డౌన్ పూర్తైతే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే అవకాసం ఉంది. 
 
ఇక ఈ సినిమాలో నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. నివేదా రోల్ చాలా ఎమోషనల్ గా సాగుతుందని.. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా వచ్చిందని చెప్తున్నారు. మొత్తం సినిమాలోనే నివేదా నటన సూపర్ స్పెషల్ గా హైలైట్ గా ఉండబోతోందట.  అలాగే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ కి అండ్ సాంగ్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోని కపూర్ సమర్పిస్తున్నారు.