చిరంజీవి, బాలకృష్ణ. వెంకటేష్, నాగార్జున ఈ నలుగురు తెలుగు సినీ పరిశ్రమకి నాలుగు స్తంభాల్లాంటి వారు. వీరిలో చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఈక్వేషన్స్ సరిగ్గా ఉండవని చెబుతారు. ఇద్దరికీ మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇద్దరికీ సెపరేట్ గా భారీ సంఖ్యలో అభిమాన సంఘాలు ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వం, ఫాలోయింగ్ బాలయ్యకి తోడైంది.

ఆ ఫాలోయింగ్ ని నిలబెట్టుకునే విధంగా బాలకృష్ణ సినిమాలు చేశారు. ఇక చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ గా ఎదిగారు. తనకంటూ ఇండస్ట్రీలో ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అభిమానుల్లో ఆయనకున్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. బయటకి ఈ ఇద్దరు హీరోలు సన్నిహితంగా ఉన్నట్లు కనిపించినా.. ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్య మాత్రం ఒక రకమైన పోటీ కనిపిస్తుంది.

బాలయ్య, చిరుల మధ్య చిన్న గ్యాప్ ఉందనే మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తుంటాయి. ఇప్పుడు ఆ సంగతి మరోసారి బయటపడింది. 'సైరా' సినిమా సక్సెస్ అయిన తరువాత చిరంజీవిని దర్శకుడు త్రివిక్రమ్ ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో చిరు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.

'సైరా' సినిమాను చూసిన నాగార్జున తనను కౌగిలించుకొని, ఎపిక్ సినిమా అన్నారని.. ఆ తరువాత వెంకటేష్ ఇంటికి వచ్చి మరీ శుభాకాంక్షలు చెప్పి హగ్ చేసుకున్నారని.. రజినీకాంత్ ఫోన్ చేసి మెచ్చుకున్నారని.. వాళ్ల ఆవిడ లతగారు కూడా చాలా ఎమోషనల్ అయ్యారని చిరు చెప్పారు. వీళ్లే కాకుండా 'సైరా' గురించి మొత్తం ఇండస్ట్రీ స్పందించింది. 

కానీ బాలకృష్ణ మాత్రం నోరు మెదపలేదు. ఇప్పటివరకు చిన్న రియాక్షన్ కూడా ఇవ్వలేదు. బాలయ్య స్పందించే అవకాశం లేదని వారి గురించి తెలిసినవాళ్లు చెబుతున్నారు.