ఇప్పుడున్న యువ దర్శకుల్లో వేగంగా సినిమాలు చేస్తూ మంచి కమర్షియల్ హిట్స్ అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈ డైరెక్టర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సుప్రీమ్ - రాజా ది గ్రేట్ సినిమాల అనంతరం చేసిన మల్టీస్టారర్ సినిమా F2 కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ ని అందించింది.

ఇక నెక్స్ట్ మరో బిగ్ సినిమాతో అనిల్ తన క్రేజ్ ని పెంచుకోబోతున్నాడు. మహేష్ తో తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. అయితే సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ లో దర్శకుడు అనిల్ ఆగడుకి సంబందించిన ఒక విషయాన్నీ బయటపెట్టాడు.

డైరెక్టర్ కాకముందు అనిల్ చాలా సినిమాలకు రైటర్ గా వర్క్ చేశాడు. ఇక ఆగడు సినిమాకు కూడా రైటర్ గా పని చేయడానికి ఒప్పుకున్నా అనిల్ ఆ సినిమా ఫస్ట్ హాఫ్ వరకే ఉన్నాడట. ఫస్ట్ ఫినిష్ చేశాక సడన్ గా కళ్యాణ్ రామ్ నుంచి పిలుపు రావడంతో పటాస్ సినిమా డైరెక్షన్ చేయడానికి వెళ్లాడు.

అయితే ఎప్పుడైనా ఆ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల ఎదురుపడితే.. "ఆగడు సినిమా సెకండ్ హాఫ్ కి నాతో ఉండకుండా వెళ్లిపోయావ్ కదా.. నీ అంతు చూస్తా అని' శ్రీను వైట్ల గారు సరదాగా అంటూ ఉంటారని అనిల్ ఇటీవల వివరణ ఇచ్చాడు. అలాగే ఆ సినిమా సెకండ్ హాఫ్ కి ఉండి ఉంటే ఆ సినిమా హిట్ అయ్యి ఉండేదని, శ్రీను వైట్ల గారు ఆ మాట అన్నపుడు చాలా బాధగా అనిపించిందని తెలియజేశారు.