Asianet News TeluguAsianet News Telugu

Johnny Depp : డిస్నీ సంస్ద సారీ చెప్పి, 2535 కోట్లు ఆఫర్ ??

ఇప్పటిదాకా విడుదలైన సినిమాల్లో జానీ డెప్‌ పాత్రే ప్రధాన ఆకర్షణ. అయితే  యువత ఇంకా అతణ్నే చూడాలని కోరుకోవడంతో తప్పేటట్లు లేదని అంటున్నారు, కాయా స్కోడాల్‌రియో, బ్రెన్‌టన్‌ థ్వైట్స్‌ వంటి కొత్త నటులను చూసేందుకే ఆసక్తి చూపుతున్నారని భావించినా చివరకు జానీ డెప్ వైపే మ్రొగ్గు చూపించి డిస్నీ సంస్ద. 

 Did Disney apologise to Johnny Depp with Rs 2535 crore offer
Author
Los Angeles, First Published Jun 27, 2022, 9:59 AM IST


 కెప్టెన్‌ జాక్‌ స్పారో..  ఆ గెటప్ ,లుక్ చూడగానే ఓ కొత్త ప్రపంచం మన కళ్లముందు ఆవిష్కారమవుతుంది. పైరేట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌ సీరిస్‌ సినిమాల్లో పిల్లాపెద్దలను ఎంతగానో అలరించిన పాత్ర అది.  ఆ పాత్ర తిరిగి తెరపై కనిపించనుందని సమాచారం.  మొదట ఈ పాత్రను ఇంక అక్కడితో ఆపేద్దామనుకుంది డిస్నీ సంస్ద. ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన డిస్ని సంస్థతో జానీడెప్ కి వివాదం ఏర్పడటంతో వారితో ఉన్న సినిమాలని రద్దు చేసుకొని బయటకి వచ్చాడు.

దాంతో  ఇకపై ఈ సీరిస్‌లో వచ్చే సినిమాల్లో జాక్‌ స్పారో కనిపించడని, ఆయన పాత్రను చంపేస్తామని నిర్మాణ సంస్థ డీస్నీ తాజాగా ప్రకటించింది. ‘డెడ్‌ మ్యాన్‌ టెల్స్‌ నో టేల్స్‌’ పేరుతో ఇటీవల విడుదలైన సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందకపోవడానికి కారణం కూడా జాక్‌ స్పారో క్యారెక్టర్లో నటించిన జానీ డెప్‌ కారణమని నిర్మాణ సంస్థ భావిస్తోందని, అందుకే ఆయనను ఇకపై వచ్చే సినిమాల్లో పక్కనబెట్టాలని నిర్ణయించే ఆ పాత్రను చంపేయాలనుకుంటున్నారని స్థానిక వెబ్‌సైట్‌ వెల్లడించింది. కానీ ఇప్పుడా నిర్ణయం నిర్ణయం మార్చుకుందని సమాచారం.

వాస్తవానికి ఇప్పటిదాకా విడుదలైన సినిమాల్లో జానీ డెప్‌ పాత్రే ప్రధాన ఆకర్షణ. అయితే  యువత ఇంకా అతణ్నే చూడాలని కోరుకోవడంతో తప్పేటట్లు లేదని అంటున్నారు, కాయా స్కోడాల్‌రియో, బ్రెన్‌టన్‌ థ్వైట్స్‌ వంటి కొత్త నటులను చూసేందుకే ఆసక్తి చూపుతున్నారని భావించినా చివరకు జానీ డెప్ వైపే మ్రొగ్గు చూపించి డిస్నీ సంస్ద. అందుకే ఇకపై జాక్‌ స్పారో పాత్రను చంపేసి, దాని స్థానంలో కొత్త పాత్రను సృష్టించాలనే ఆలోచనకు  డిస్నీ  బై చెప్పేసిందని సమాచారం.

అయితే రమ్మన్నప్పుడు వచ్చి..వెళ్లమన్నప్పుడు వెళ్లటానికి జానీడెప్ మామూలు వాడా. అందుకే డిస్నీ సంస్ద ఓ స్ట్రాటజీతో ముందుకు వెళ్తోంది.  తాజాగా జానీడెప్ కి డిస్నీప్లస్ జాక్ స్పారో క్యారెక్టర్‌గా మళ్ళీ తిరిగి రావడానికి అతనికి సారీ చెప్పి ఏకంగా రూ.2,355 కోట్ల ($301 మిలియన్) డీల్ ఆఫర్ చేసినట్లు సమాచారం. డిస్నీ కంపెనీలోని కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం డిస్నీప్లస్ అధికారికంగా జాక్ స్పారోకి క్షమాపణలు చెప్పి మళ్ళీ ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సినిమా సిరీస్ కోసం రావాలని అడుగుతూ 2300 కోట్ల డీల్ ని పంపింది అని చెప్తున్నారు.

కార్పొరేట్ పద్దతితో జానీడెప్ కి క్షమాపణ లేఖతో ఓ బహుమతి బాస్కెట్‌ను పంపించింది డిస్నీ. ఇప్పటికే జాక్ స్పారో క్యారెక్టర్ ని ఆధారంగా తీసుకొని ఒక సినిమాని కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇది కూడా ఆ లేఖలో తెలిపింది. కాబట్టి ప్రపంచమంతటా ప్రేక్షకులు మెచ్చిన ఆ క్యారెక్టర్ కోసం అయినా తిరిగి రావాలని కోరింది. అయితే ఇప్పటివరకు జానీ డెప్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. జానీడెప్ కి ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ చేయడంతో హాలీవుడ్ నటులు కూడా ఆశ్చర్యపోతున్నారు. 
 
ఇక జానీడెప్ పలు సినిమాలతో ప్రపంచమంతటా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సినిమాతో బాగా పాపులారిటీ సంపాదించాడు. ఇటీవల తన భార్యతో విడాకులు తీసుకొని తన భార్యపై పరువు నష్టం దావాలో గెలిచి వార్తల్లో నిలిచాడు జానీడెప్. ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సినిమాలో జాక్ స్పారో క్యారెక్టర్ ప్రేక్షకులకి బాగా చేరువైంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios