అర్జున్ రెడ్డి చూశాకే తన కొడుకు ధృవ్ ని ఈ చిత్రంతోనే హీరోగా లాంచ్ చేయాలని విక్రమ్ ఫిక్స్ అయ్యాడు. అర్జున్ రెడ్డి రీమేక్ హక్కులు సొంతం చేసుకుని సీనియర్ దర్శకుడు బాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. షూటింగ్ కూడా పూర్తయింది. కానీ నిర్మాతలకు, తన విభేదాలతో బాల ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. 

ఆ తర్వాత గిరిసాయి దర్శకత్వంలో తిరిగి కొత్తగా షూటింగ్ ప్రారంభించారు. ఇటీవల షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. నేడు ఆదిత్య వర్మ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ లో ధృవ్ పెర్ఫామెన్స్ అదిరిపోయింది. 

రొమాంటిక్, ఎమోటినల్ సన్నివేశాల్లో ధృవ్ నటన ఆకర్షించే విధంగా ఉంది. బనిత సందు ఈ చిత్రంలో ధృవ్ సరసన హీరోయిన్ గా నటించింది. నవంబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.